ఈ ఏడాది ప్రారంభంలో ‘క్రాక్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ వరసగా సినిమాలు చేస్తు్న్నాడు. ఇప్పటికే ‘ఖిలాడీ’, ‘రామారావ్ ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’ సినిమాల్లో నటిస్తోన్న ఆయన బుధవారం మరో కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. స్టువర్ట్ పురం దొంగల ముఠాలో కీలక సభ్యుడైన నాగేశ్వరరావు జీవిత కథతో తెరకెక్కుతోన్న ‘టైగర్ నాగేశ్వర రావు’ అనే చిత్రంలో ఆయన నటించనున్నారు. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాతో వంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
గజదొంగ జీవితకథతో..
ఈ సందర్భంగా ‘అక్కడ దొంగలు, దోపిడీ దారులు ఉండేవారు. అదేవిధంగా నాగేశ్వరరావు కూడా ఉన్నారు’ అంటూ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్‌లో పంచుకుంది చిత్ర బృందం. ‘ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ హంట్’ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక టైగర్ నాగేశ్వరరావు విషయానికొస్తే..1970వ దశకంలో ఈ గజదొంగ పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. చిక్కినట్లే చిక్కి పోలీసుల కళ్లు గప్పి చాకచక్యంగా తప్పించుకునేవాడు. 1987లో పోలీసులు నాగేశ్వరరావును మట్టుబెట్టారు. ఇది రవితేజకు 71 వ సినిమా. హీరోయిన్, ఇతర తారగణం వివరాలను త్వరలోనే తెలియజేస్తామంటూ చిత్రబృందం తెలిపింది.
#TigerNageswaraRao pic.twitter.com/9EFYsS4OWw
— Ravi Teja (@RaviTeja_offl) November 3, 2021
Also read: