గతకొద్ది రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో రష్మిక డీప్ ఫేక్ వీడియో గురించే చర్చ జరుగుతుంది. కొంతమంది కంత్రీగాళ్ళు రష్మిక ఫేక్ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫేక్ వీడియో పై సినీ సెలబ్రెటీలంతా స్పందిస్తున్నారు. ముందుగా రష్మిక స్పందిస్తూ చాలా బాధ కలిగించింది అని తెలిపింది. సినీ సెలబ్రెటీలు కూడా రష్మిక ఫేక్ వీడియోను ఖండించారు. నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, చిన్మయి, మంచు విష్ణు ఇలా చాలా మంది ఈ వీడియో పై స్పందించింది. ఇది చాలా దారుణం.. ఇలా జరగడం బాధ కలిగించింది. ఇలాంటివి ఇక పై జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ మహిళా వీడియోకు ఏఐ టక్నాలజీ ఉపయోగించి ఆమె ముఖానికి బదులు రష్మిక ముఖాన్ని ఉంచారు. ఈ వీడియో వైరల్ కావడంతో దీని పై అందరు స్పందించారు.
ఇదిలా ఉంటే తాజాగా రష్మిక సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. రష్మిక వర్కౌట్స్ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో రష్మిక గ్లామరస్ గా కనిపించింది. రష్మిక వర్కౌట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో కు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప సినిమా సీక్వెల్ లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. అలాగే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది రష్మిక మందన్న.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.