Rashmika Mandanna: స్కూల్‌లో యావరేజ్‌ స్టూడెంట్‌నే.. అక్కడ మాత్రం నేనే టాపర్‌ని.. రష్మిక చిన్ననాటి ముచ్చట్లు

|

Sep 14, 2022 | 4:16 PM

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika). అందులో పల్లెటూరి యువతి గెటప్‌లో పోషించిన శ్రీవల్లి పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార.

Rashmika Mandanna: స్కూల్‌లో యావరేజ్‌ స్టూడెంట్‌నే.. అక్కడ మాత్రం నేనే టాపర్‌ని.. రష్మిక చిన్ననాటి ముచ్చట్లు
Rashmika Mandanna
Follow us on

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika). అందులో పల్లెటూరి యువతి గెటప్‌లో పోషించిన శ్రీవల్లి పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటోందీ అందాల తార. ఇటీవల బెంగళూరు వేదికగా జరిగిన సైమా అవార్డుల్లో పుష్ప సినిమా ఐదు అవార్డులు గెల్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుందీ సొగసరి. ముఖ్యంగా తన బాల్యం, హాస్టల్‌ జీవితం ముచ్చట్లను అందరితో షేర్‌ చేసుకుంది. ‘నా బాల్యం ఎక్కువగా హాస్టల్‌లోనే గడిచిపోయింది. ఎక్కడికి వెళ్లినా చుట్టూ స్నేహితులు ఉండేవారు. వారినే నా కుటుంబంగా భావించాను. టీచర్లతోనూ గౌరవంగా మెలిగేదాన్ని. వారిలోనే మా అమ్మను చూసుకునేదాన్ని. ఇక చదువు విషయానికొస్తే.. స్కూల్‌లో నేను యావరేజ్‌ స్టూడెంట్‌నే. అయితే ప్లస్‌2, డిగ్రీలో మాత్రం క్లాస్‌ టాపర్‌గా వచ్చాను. నాకు గణితం, బయాలజీ సబ్జెక్టులంటే భయం. అందుకే ప్లస్‌2లో నాకు ఇష్టమైన సీఈసీ గ్రూపులో చేరాను. డిగ్రీ వరకు ఉత్తమ ప్రతిభ కనబరిచాను’ అని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకుంది రష్మిక.

కాగా సీతారామం సినిమాలో అఫ్రీన్‌గా అదరగొట్టిన రష్మిక త్వరలోనే గుడ్‌బై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అమితాబ్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్‌7న విడుదల కానుంది. దీని తర్వాత పుష్ప2 సినిమా షూటింగ్‌ త్వరలోనే జాయిన్‌ కానుంది. వీటితో పాటు విజయ్‌ దళపతి సరసన వారసుడు చిత్రంలోనూ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక బాలీవుడ్‌లో మిషన్‌ మజ్ఞు, యానివల్‌ సినిమాలను లైన్లో పెట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..