
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ రష్మీ గౌతమ్. యాంకర్ గా ఈ చిన్నది విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే తన అందంతో హీరోయిన్ గానూ ఛాన్స్ అందుకుంది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు సుడిగాలి సుధీర్. వేణు టీమ్ లో కమెడియన్ గా చేసిన సుధీర్ ఆతర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జబర్దస్త్ ద్వారా సుధీర్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు అలాగే సుధీర్ ఇప్పుడు సినిమాలతో పాటు యాంకర్ గాను చేస్తూ అదరగొడుతున్నాడు. ఇదిలా ఉంటే సుధీర్, రష్మీ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
జబర్దస్త్ షో లో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. షో నిర్వాహకులు కూడా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అనేలా ఎపిసోడ్స్ ప్లాన్ చేయడం, లవ్ బీజీఎమ్ లు వేయడం, రకరకాల ఎడిట్ లు చేసి చూపించడంతో ప్రేక్షకులు కూడా ఇద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. కాగా మా ఇద్దరి మధ్య లాంటిదేమీ లేదు అని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధీర్ గురించి రష్మీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెరపై మీ ఇద్దరి కెమిస్ట్రీని చూసి, షోలో ఏదో జరుగుతోందని బయట చాలామంది భావిస్తుంటారని, దీనిపై తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఎప్పుడూ ప్రశ్నించలేదా అని యాంకర్ అడగ్గా, రష్మీ క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ, ప్రేక్షకులు చూస్తున్నది ప్రతి ఎపిసోడ్‌లో కనిపించే కనెక్టివిటీ మాత్రమే కాదని, అది తమ ఆఫ్-స్క్రీన్ సంబంధం నెమ్మదిగా ఎలా డవలప్ చెందిందో, అదే తెరపై కనిపిస్తుందని తెలిపింది. 2013లో మొదటి ఎపిసోడ్ రాగానే సుధీర్ తనకు లైన్ వేయడం లేదా తాను దానికి మురిసిపోవడం వంటివి జరగలేదని రష్మీ తెలిపింది. వారి పదేళ్ల ప్రయాణం ఒక సహజసిద్ధమైన ప్రక్రియ అని, రాత్రికి రాత్రే ఏర్పడిన బంధం కాదని ఆమె అన్నారు. పదేళ్ల పాటు కలిసి పనిచేయడం ద్వారా ఈ బంధం క్రమంగా బలపడిందని చెప్పుకొచ్చింది. తాను షో ప్రారంభించినప్పుడు సుధీర్ అందరిలోకెల్లా చిన్నవాడని, తాను కూడా కొత్తగా చేరానని రష్మీ గుర్తుచేసుకున్నారు. ఈక్వేషన్ నెమ్మదిగా అలా అలా ఏర్పడిందని చెప్పుకొచ్చింది.