కామెడీ రోల్స్ చేయటం అంత ఈజీ కాదు.. అది కూడా స్టార్ ఇమేజ్‌ను క్యారీ చేస్తూ ఓ హీరోయిన్ కామెడీ పండించటం అంటే మరీ కష్టం. అలాంటి రేర్ ఫీట్‌ను ఈజీగా కంప్లీట్ చేస్తున్నారు యంగ్ బ్యూటీ రాశీఖన్నా. బెల్లం శ్రీదేవి, ఏంజెల్ ఆర్నా లాంటి క్యారెక్టర్స్ ఓ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయంటే అందుకు రాశీ టైమింగే కారణం. ఇప్పుడు మరోసారి అలాంటి ఫన్నీ రోల్ ప్లే చేస్తున్నారు ఈ అందాల భామ. మారుతి డైరెక్షన్‌లో గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో ఫన్నీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ రేంజ్‌లో కామెడీ పండించటం వెనుక సీక్రెట్ ఏంటో కూడా రివీల్ చేశారు రాశీ.
‘అందరూ కామెడీ చేయటం కష్టం అంటారు.. కానీ నాకు మాత్రం కామెడీ చేయటమే చాలా ఈజీ.. ఈ టాలెంట్ నాకు మా నాన్న నుంచి వచ్చింది. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమరే నాకు కూడా వచ్చింది. అదే ఇప్పుడు తెర మీద కూడా కనిపిస్తోంది’ అంటూ తన నటన వెనుక ఉన్న అసలు విషయం బయట పెట్టారు రాశీ. కాగా కెరీర్ తొలినాళ్లలో డ్యాన్స్ విషయంలో కాస్త ఇబ్బందిపడ్డ రాశీ… ఇప్పుడు డ్యాన్స్ విషయంలో కూడా దుమ్మురేపుతోంది. అటు గ్లామర్ షో విషయంలో కూడా తనకు పరిమితులు లేవని చెబుతూనే ఉంది. మొత్తంగా ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఇండస్ట్రీ ఫేవరెట్ హీరోయిన్‌గా మారింది.
Also Read: మెగా బ్రదర్ నాగబాబు వాట్సాఫ్ డీపీ ఇదేనట.. ఆయన స్వయంగా తెలిపారు
బాలరామాయణం విడుదలై పాతికేళ్లు.. వెండితెరపై అద్భుతం చేసిన గుణశేఖర్