Raashi Khanna : జిమ్‌‌‌‌‌లో చమట చిందిస్తున్న చిన్నది.. కిక్ బాక్సింగ్ తో అందానికి పదునుపెడుతున్న బ్యూటీ

|

Mar 01, 2021 | 12:55 PM

అందాల రాశి రాశీ ఖన్నా... జిమ్‌లో తన అందాలకు మరింత పదును పెడుతోంది. ఇంకా నాజూగ్గా తయారవ్వడం కోసం.. నానా పాట్లు పడూతూ

Raashi Khanna : జిమ్‌‌‌‌‌లో చమట చిందిస్తున్న చిన్నది.. కిక్ బాక్సింగ్ తో అందానికి పదునుపెడుతున్న బ్యూటీ
Follow us on

Raashi Khanna Workout : అందాల రాశి రాశీ ఖన్నా.. జిమ్‌లో తన అందాలకు మరింత పదును పెడుతోంది. ఇంకా నాజూగ్గా తయారవ్వడం కోసం.. నానా పాట్లు పడూతూ మరీ కిక్ బాక్సింగ్ నేర్చుకుంటోంది. పంచింగ్ బ్యాగ్‌ని తన లేత కాళ్లతో కిక్ చేస్తూ చమట్లు చిందిస్తుంది ఈ చిన్నది. అమ్మడు జిమ్ లో కష్టపడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇలా కిక్ బాక్సింగ్ వెనుక పడడానికి రాశీకి ఓ రెండు కారణాలు ఉన్నయాట లెండి.. ఒకటేమో ఫిట్‌నెస్‌ కాగా.. మరోటి ప్రస్తుతం బాలీవుడ్లో చేస్తున్న సన్నీ సినిమా.. అవును రాశీ బాలీవుడ్‌లో సన్నీ అనే ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో పాత్ర కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకోవ‌డ‌మే కాదు.. సీరియ‌స్‌గా కిక్ బాక్సింగ్ ట్రైనింగ్‌లో లీన‌మైంది రాశి.

ఇక ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన రాశీ..“ప్ర‌తిరోజూ రెండు గంట‌ల పాటు హై ఇంటెన్స్ ఇట‌ర్వెల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. కిక్ బాక్సింగ్ వంటి మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకోవ‌డం వ‌ల్ల శారీరకంగానే కాదు, మానసికంగానూ బ‌లంగా త‌యార‌వుతాం. దీని కోసం ప్ర‌త్యేక‌మైన డైట్‌ను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎంత పెద్ద ఛాలెంజ్‌నైనా ఎదుర్కొంటాన‌నే మాన‌సిక ధైర్యం ఏర్ప‌డింది“ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒక తమిళ్ సినిమా, ఒక బాలీవుడ్ సినిమా, ఒక తెలుగు సినిమా ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!

ఆ డైరెక్టర్ నన్ను నడి రోడ్డుపై వదిలేశాడు.. ఎమోషనల్ అయిన నితిన్ వీడియో : Hero Nithin shocking comments video