తెలుగు సినిమాలపై ఇప్పుడు బాలీవుడ్ హీరోలు మనసు పారేసుకుంటున్నారు. మన రచయితలు, దర్శకులు రాసే అద్భుతమైన కథలు వారిని ఇంప్రెస్ చేస్తున్నాయి. దీంతో మన కథల రీమేక్ రైట్స్ కొని అక్కడ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు హిందీ చిత్ర సీమ దర్శక, నిర్మాతలందరూ విజయవంతమైన తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఈ జాబితాలో ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా ఉంది. ( గుంటూరు జిల్లా : వింత వ్యాధితో కోళ్లు మృత్యువాత )
రామ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రమిది. నభానటేష్ , నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. పూర్తి యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా తెలుగు మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ గతంలో ఎప్పుడూ కనిపించని ఊర మాస్ అవతార్ తో అలరించాడు. కాగా ఈ సినిమాపై బాలీవుడ్ బడా హీరో రణ్‌వీర్ సింగ్ మనసు పడ్డాడని సమాచారం. ఈ చిత్రానికి హిందీలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రామ్ పాత్రలో నటించేందుకు రణ్‌వీర్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని టాక్. మరి దర్శకుడు ఎవరనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ( వాట్సాప్‌లో కొత్తగా అదిరిపోయే ఫీచర్స్ )