Animal Movie: షాకిస్తున్న ‘యానిమల్’ రన్ టైమ్.. ఏకంగా 3 గంటలకు పైగా ?..

|

Nov 28, 2023 | 12:35 PM

ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా రణబీర్ తన నటనతో మెప్పించేందుకు రెడీ అయ్యారు. అంతేకాకుండా తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం.. ఎమోషన్స్ ఈ సినిమాలో చూపించారు సందీప్. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.

Animal Movie: షాకిస్తున్న యానిమల్ రన్ టైమ్..  ఏకంగా 3 గంటలకు పైగా ?..
Animal Movie
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సినిమా ‘యానిమల్’. అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేశారు. ఇందులో ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా రణబీర్ తన నటనతో మెప్పించేందుకు రెడీ అయ్యారు. అంతేకాకుండా తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం.. ఎమోషన్స్ ఈ సినిమాలో చూపించారు సందీప్. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. రష్మిక, రణబీర్ తోపాటు. డైరెక్టర్ సందీప్ సైతం యానిమల్ ఈవెంట్లలో పాల్గొంటున్నారు.

యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సోమవారం హైదరాబాద్ లో నిర్వహించింది చిత్రయూనిట్. ఈవేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ సినిమా రన్ టైమ్ చూసి ఆశ్చర్యపోతున్నారు అడియన్స్. దాదాపు 3 గంటల 21 నిమిషాల నిడివి ఉంటుందని.. సెన్సార్ బోర్టు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే దర్శకుడు సందీప్ వంగా ఫస్ట్ కట్ పూర్తయ్యే సమయానికి ఈ సినిమా ఏకంగా 3 గంటల 49 నిమిషాలుగా ఉందట.

ఇవి కూడా చదవండి

ఇంత రన్ టైమ్ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో ప్రదర్శించడం చాలా కష్టం. నాలుగు షోలు వేయాలంటే చాలా కష్టమని తెలుస్తోంది. ఇక అతి కష్టం మీద ఈ సినిమాను 3 గంటల 21 నిమిషాలకు కుదించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ తెలిపాడు. ఈ సినిమాతో తొలిసారిగా రణబీర్ సౌత్ అడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.