ఐ యామ్ ఫైన్..అవే రూమర్స్‌తో బోర్ కొట్టించకండి : రానా

| Edited By:

Aug 07, 2019 | 3:58 PM

టాలీవుడ్ క్రేజీ హీరో  రానా హెల్త్ కండీషన్ గురించి రూమర్స్ గట్టిగా షికారు చేస్తున్నాయి. కిడ్నీల శస్త్ర చికిత్స జరిగిందని, రానా మదర్ ఒక కిడ్నీని డొనేట్ చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకోసం అమెరికా వెళ్లాడని ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజంలేదని మరోసారి స్పష్టత ఇచ్చాడీ దగ్గుబాటి హీరో. పదే, పదే తన ఆరోగ్యం గురించి అడగడం విసుగు తెప్పిస్తోందన్న రానా…హ్యపీగా ఉన్నానని..ఎటువంటి సర్జరీ జరగలేదంటూనే.. తనపై చూపిస్తున్న ప్రేమకు […]

ఐ యామ్ ఫైన్..అవే రూమర్స్‌తో బోర్ కొట్టించకండి : రానా
Follow us on

టాలీవుడ్ క్రేజీ హీరో  రానా హెల్త్ కండీషన్ గురించి రూమర్స్ గట్టిగా షికారు చేస్తున్నాయి. కిడ్నీల శస్త్ర చికిత్స జరిగిందని, రానా మదర్ ఒక కిడ్నీని డొనేట్ చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకోసం అమెరికా వెళ్లాడని ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజంలేదని మరోసారి స్పష్టత ఇచ్చాడీ దగ్గుబాటి హీరో.

పదే, పదే తన ఆరోగ్యం గురించి అడగడం విసుగు తెప్పిస్తోందన్న రానా…హ్యపీగా ఉన్నానని..ఎటువంటి సర్జరీ జరగలేదంటూనే.. తనపై చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటనని తెలిపాడు. ప్రస్తుతం రానా హిరణ్యకశ్యప, విరాటపర్వం 1992 లాంటి తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు.