Ramesh Babu-Krishna: ఏతండ్రికైనా తన కళ్ళముందే కొడుకును విగతజీవిగా చూడడం అత్యంత కష్టమైన విషయం. తన కళ్ల ముందే.. విగతజీవిగా పడివున్న కొడుకు రమేష్ బాబుని చూసి చలించిపోయారు సూపర్ స్టార్ కృష్ణ. కన్నీళ్లతో తన కొడుకు రమేష్ బాబుకి నివాళులర్పించారు. నా కంటే ముందే ఈ లోకాన్ని వీడిపోయావా బాబూ..! అంటూ…కృష్ణ కన్నీరు మున్నీరు అయ్యారు. వృధ్దాప్యంలో తనకీ శిక్షేంటని దేవున్ని నిందిస్తూనే మౌనంగా కొడుకు భౌతిక ఖాయం పక్కనే కూర్చిండి పోయారు సూపర్ స్టార్ కృష్ణ. కృష్ణ పరిస్థితిని చూసిన చూపరులకు కన్నీరు పెట్టిస్తోంది.
రమేష్ బాబు మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. పద్మాలయ స్టూడియోస్ కి రమేష్ బాబు భౌతికకాయాన్ని తరలించారు. ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరుగనున్నాయి. అభిమానుల సందర్శనార్ధం కుటుంబ సభ్యులు రమేష్ భౌతిక కాయాన్ని తరలించారు. పద్మాలయ స్టూడియోకు ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, సీని ప్రముఖులు చేరుకుంటున్నారు. రమేష్ బాబు భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. అయితే రమేష్ తమ్ముడు సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడిన నేపథ్యంలో అన్న అంత్యక్రియలకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లు.. దిగుమతిపై నిషేధం విధించిన చైనా.. సూపర్ మార్కెట్లు బంద్