Ram Pothineni: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న అభిమాని ఇంటికెళ్లిన హీరో రామ్.. హార్ట్ టచింగ్ వీడియో

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని రీల్ లైఫ్‌లో మాత్రమే కాదు... రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నాడు. చాలా ఏళ్లుగా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని ఇంటికి వెళ్లాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది.

Ram Pothineni: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న అభిమాని ఇంటికెళ్లిన హీరో రామ్.. హార్ట్ టచింగ్ వీడియో
Ram Pothineni

Updated on: May 21, 2026 | 1:15 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన అభిమాని ఒకరు అరుదైన వ్యాధితో బాధ పడుతుందని తెలిసి ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. గత 18 ఏళ్లుగా ‘ ఫ్రీడ్రిచ్ అటాక్సియా అనే అరుదైన నరాల బలహీనత వ్యాధితో పోరాడుతున్న ఒక వీరాభిమాని ఎప్పటి నుంచో హీరో రామ్ ను కలవాలని కోరుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ స్వయంగా ఆమె ఇంటికే వెళ్లారు. ఆమెతో కాసేపు ముచ్చటించి, ధైర్యం చెప్పారు. సరదాగా ఫొటోలు కూడా దిగారు. ఇక తనను కలిసేందుకు వచ్చిన హీరో రామ్ ను చూసి ఆ అభిమాని చాలా హ్యాపీగా ఫీలయ్యింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు, సినీ అభిమానులు హీరో రామ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘రియల్ హీరో అంటే నువ్వే అన్నా’ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఫ్రెడ్రిచ్ అటాక్సియా అంటే ఇదొక జన్యుపరమైన రుగ్మత. ఆ వ్యాధి బారిన పడిన వ్యక్తులకు… మెదడు, వెన్నుపాము, నరాల వ్యవస్థ ప్రభావితం అవుతుంది. శరీర సమన్వయం, నడక దెబ్బ తింటాయి. రామ్ అభిమాని కూడా సుమారు 18 ఏళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతోంది. అది తెలిసే హీరో రామ్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా ఆంధ్రాకింగ్ తాలుకాలో చివరిగా కనిపించాడు హీరో రామ్. గతేడాది విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఇప్పుడు తన తర్వాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు రామ్. ఇప్పటికే నటుడిగా, గాయకుడిగా సత్తా చాటిన రామ్ ఇప్పుడు తన సినిమా కోసం తనే మెగా ఫోన్ పట్టుకున్నాడు. RAPO23 (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను హీరో రామే స్వయంగా తెరకెక్కిస్తున్నారు. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్’ (The Story of a Lone Wolf) అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us