Ram Gopal Varma: గత 50 ఏళ్లలో ఇలాంటి సినిమా రాలేదు.. ఆ స్టార్ హీరో మూవీపై ఆర్జీవీ ప్రశంసల వర్షం

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సినిమాలేవీ చేయడం లేదు. కానీ తన కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు ఆర్జీవీ. గత 50 ఏళ్లలో ఇలాంటి మూవీ..

Ram Gopal Varma: గత 50 ఏళ్లలో ఇలాంటి సినిమా రాలేదు.. ఆ స్టార్ హీరో మూవీపై ఆర్జీవీ ప్రశంసల వర్షం
Ram Gopal Varma

Updated on: Dec 25, 2025 | 4:36 PM

సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా ఇండస్ట్రీలో జరుగుతోన్న సంఘటనలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నాడు. అలాగే కొత్తగా రిలీజవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్ లపై రివ్యూలు కూడా ఇస్తున్నాడు. తాజాగా ఓ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ. గత 50 ఏళ్లలో ఇంతగా చర్చించుకున్న సినిమా మరొకటి లేదని, ఈ మూవీని చూస్తుంటే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటో తలచుకుంటేనే భయమేస్తోందంటూ ట్వీట్ పెట్టాడు.

‘మనం ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు.. అక్కడ ఒక కుక్క మనల్నే చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇంటి యజమాని అది ‘ఏం చేయదులే’ అని చెప్పినా.. మనకు మనసులో భయం వేస్తూనే ఉంటుంది కదా? ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటిదే. ప్రతి ప్రొడక్షన్ ఆఫీసులోనూ ఈ సినిమా అనే కుక్క అదృశ్యంగా తిరుగుతూ భయపెడుతోంది. దాని పేరు ఎత్తడానికి కూడా వాళ్లు ఇష్టపడటం లేదు. ఇప్పటిదాకా గ్రాఫిక్స్, భారీ సెట్లు, ఐటమ్ సాంగ్స్, స్టార్ హీరోల భజన.. ఇదే టెంప్లేట్‌తో సినిమాలు తీస్తున్న వారికి ఈ మూవీ ఒక హారర్ సినిమా లాంటిది. దీనిని చూశాక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటో తలచుకుంటేనే భయమేస్తోంది. ఈ స్టాండర్డ్స్ అందుకోలేక మిగతా వాళ్లు అసూయతో, భయంతో సైలెంట్‌గా ఉన్నారు. గత 50 ఏళ్లలో ఇంతగా చర్చించుకున్న సినిమా మరొకటి లేదు’ అని వర్మ రాసుకొచ్చాడు.
ఇంతకీ ఆర్జీవీకి ఇంత బాగా నచ్చిన సినిమా ఏదనుకుంటున్నారా? రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ధురందర్. ఇప్పటికే వెయ్యి కోట్లకు చేరువైన ఈ సినిమాపై మరోసారి ప్రశంసలు కురిపించాడీ సంచలన డైరెక్టర్.

ఇవి కూడా చదవండి

రామ్ గోపాల్ వర్మ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి