Peddi: బాబాయ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన అబ్బాయ్.. రిలీజ్‌కు ముందే పెద్ది ఊచకోత

టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విజయం కేవలం బాక్సాఫీస్ నంబర్లతోనే ముడిపడి లేదు.

Peddi: బాబాయ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన అబ్బాయ్.. రిలీజ్‌కు ముందే పెద్ది ఊచకోత
Peddi , Og

Updated on: May 09, 2026 | 4:01 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. ఉప్పెన సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్ది సినిమా కోసం మెగా అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక పెద్ది సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇది కూడా చదవండి : ఆ హీరో నాకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన కృష్ణ కుమారి

ఏ ఆర్ రెహమాన్ పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు. జూన్ 4న పెద్ది సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది.. అయితే విడుదలకు ముందే పెద్ది సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఏకంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ ఓజీ రికార్డ్స్ ను పెద్ది దాటేసింది. సుజిత్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ వచ్చిన ఓజీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి : అక్కినేని కథను మార్చి శోభన్ బాబు సినిమా.. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర ఊహించని రిజల్ట్

ఇక ఇప్పుడు పెద్ది సినిమా ఓజీ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఇప్పటివరకు ఉన్న టాప్ రికార్డులను పెద్ది బ్రేక్ చేసింది. గతంలో పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ, ఎన్టీఆర్ దేవర, అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ సలార్ వంటి భారీ చిత్రాలు మొదటి 24 గంటల్లో సాధించిన వసూళ్లను, పెద్ది కేవలం 4 గంటల్లోనే అధిగమించడం విశేషం. నార్త్ అమెరికాలో ప్రత్యంగిర సినిమాస్ సినిమా గ్రాండ్ గా విడుదల చేస్తుంది. దాదాపు 950కి పైగా ప్రీమియర్ షోలను ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : మనోడు మామూలోడు కాదు.. ఈయన ఆ స్టార్ డైరెక్టర్ అల్లుడా.!! బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us