మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు రామ్ చరణ్. విభిన్నమైన కథల ఎంపికతో సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపుతూ.. అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ SS రాజమౌళి దర్శకత్వంలో ఇటీవల RRR చిత్రంతో రామ్ చరణ్ అంతర్జాతీయ ఖ్యాతి, ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాలో రామ్‌చరణ్.. బ్రిటీష్ ప్రభుత్వంలో పోలీస్ ఆఫీసర్‌గా, అల్లూరి సీతారామరాజు గెటప్‌లో అదరగొట్టాడు. ఈ రెండు క్యారెక్టర్ల కోసం రామ్ చరణ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. అక్టోబర్‌లో జపాన్‌లో విడుదలైన RRR అక్కడ కూడా ప్రభంజనం సృష్టించింది. దీంతో చెర్రీ క్రేజ్ పీక్స్‌కు చేరింది.
సెలబ్రిటీగా విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ రామ్ చరణ్ వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతాడు. సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టినప్పటికీ అభిమానులకు టచ్‌లోకి వచ్చిందే లేదు. తనకు సంబంధించి కీలక విషయాలను షేర్ చేసుకున్న సందర్భాలూ అరుదే. అదే సమయంలో చెర్రీ భార్య ఉపాసన.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. చెర్రీకి సంబంధించిన ఫోటోలు, ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకుంటుంది. చెర్రీకి సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయాలు బయటి సమాజానికి తెలుస్తున్నాయంటే అది ఉపాసన వల్లే అని చెప్పుకోవచ్చు.
సోషల్ మీడియాకు చెర్రీ డిస్టెన్స్ పాటిస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం ఆయనకు చాలా క్లోజ్ అవుతూ వస్తున్నారు. అందుకు నిదర్శనమే తాజా సెలబ్రేషన్. ఇన్‌స్టాగ్రమ్‌లో రామ్‌చరణ్‌కు ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్లకు చేరింది. దాంతో చెర్రీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తమ అభిమాన నటుడికి ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ల ఫాలోవర్స్ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆలస్యంగా ఇన్‌స్టాగ్రమ్‌లో అడుగు పెట్టడమే కాదు.. ఎప్పుడూ ఇన్‌యాక్టీవ్‌గా ఉన్నప్పటికీ రామ్ చరణ్‌కు ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్స్ దాటడంపై ఉబ్బితబ్బిబ్బైపోతున్న అభిమానులు.. స్క్రీన్ షాట్స్ చేస్తూ దీనిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC 15 సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతుండగా చెర్రీ కూడా అక్కడే ఉన్నాడు. కియారా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. న్యూజిలాండ్‌లో ఈ సినిమాకు సంబంధించిన పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో చెర్రీ ఐఏఎస్ అధికారిగా కనించనున్నాడు. శ్రీకాంత్ మేక, ఎస్‌జే సూర్య, అంజలి సహా ఇతర ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 మధ్యలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..