Peddi Movie : పెద్ది గురించి స్వయంగా అడిగిన ప్రధాని మోదీ.. వికసిత్‌ భారత్‌ గురించి చెప్పే కథ అన్నాను.. రామ్ చరణ్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. జూన్ 4న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా దిల్లీలో ఒక గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చరణ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Peddi Movie : పెద్ది గురించి స్వయంగా అడిగిన ప్రధాని మోదీ.. వికసిత్‌ భారత్‌ గురించి చెప్పే కథ అన్నాను.. రామ్ చరణ్..
Ram Charan, Modi

Updated on: May 28, 2026 | 8:36 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఇదివరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదివరకే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం దేశవ్యాప్తంగా ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే భోపాల్, బెంగళూరు నగరాలలో సందడి చేసిన ఈ టీమ్, గురువారం దేశ రాజధాని దిల్లీలో ఒక గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరో రామ్ చరణ్, కథానాయిక జాన్వీ కపూర్, నటులు దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

ప్రధాని మోదీ స్ఫూర్తినింపే కథ చెప్పారు: రామ్ చరణ్
ఈ ప్రెస్‌మీట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. “నేను గతంలో ప్రధాని మోదీని కలిసినప్పుడు.. ‘పెద్ది’ సినిమా దేని గురించి అని ఆయన అడిగారు. ఓ రకంగా ఇది వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని వివరించాను. అప్పుడు ఆయన నాతో ఒక స్ఫూర్తినింపే నిజ జీవిత కథను పంచుకున్నారు” అని చరణ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ఒక గ్రామానికి చెందిన మహ్మద్ అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు దేశం తరఫున ఆడి, తన ఊరికి ఎలా గుర్తింపు తెచ్చాడో ప్రధాని వివరించారని, నేడు ఆ గ్రామం నుండి 85 మందికి పైగా క్రీడాకారులు తయారయ్యారని మోదీ చెప్పినట్లు చరణ్ పేర్కొన్నారు. ఒకే ఒక్క వ్యక్తి సమాజంలో ఎంతటి మార్పు తీసుకురాగలడు అనేదానికి ఈ కథ నిదర్శనమని, ‘పెద్ది’ సినిమాలో తన పాత్ర కూడా సరిగ్గా అలాంటి స్ఫూర్తితోనే సాగుతుందని ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో సినిమాలో మీ డ్యాన్స్ గురించి అడగ్గా.. “నిర్మాత మంచి పారితోషికం ఇచ్చారు” అంటూ చరణ్ నవ్వులు పూయించారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

చరణ్ చాలా కూల్.. బొమన్ ఇరానీతో నటించడం నా కల: జాన్వీ కపూర్
కథానాయిక జాన్వీ కపూర్ మాట్లాడుతూ రామ్ చరణ్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తెరపై కనిపించే రామ్ చరణ్‌కు, నిజ జీవితంలో ఉండే చరణ్‌కు అస్సలు పోలిక ఉండదని, బయట ఆయన చాలా కూల్‌గా ఉంటారని చెప్పారు. అలాగే, సీనియర్ నటుడు బొమన్ ఇరానీతో కలిసి నటించాలనే తన కల ఈ సినిమాతో నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు బుచ్చిబాబు సానా విజన్‌ను తాను పూర్తిగా నమ్మి, ఆయన చెప్పినట్లే ఫాలో అయ్యానని, చిత్ర యూనిట్ అంతా ఆయనకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయామని జాన్వీ పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

Follow Us