Peddi: ప్రీమియర్లతోనే పెద్ది ఊచకోత.. వరల్డ్ వైడ్‌గా ఎంత వాసుల్లో చేసిందంటే

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఈరోజు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. ఉదయం ఆట నుంచే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వస్తోంది.

Peddi: ప్రీమియర్లతోనే పెద్ది ఊచకోత.. వరల్డ్ వైడ్‌గా ఎంత వాసుల్లో చేసిందంటే
Peddi

Updated on: Jun 04, 2026 | 6:10 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఖాతంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ వేసుకున్నాడు. తాజాగా విడుదలైన పెద్ది సినిమా బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ సినిమాతర్వాత వచ్చిన పెద్ది సినిమాపై అభిమానులు బారి అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలను పెద్ది అందుకుంది. బుచ్చిబాబు సన దర్శకత్వలో తెరకెక్కిన పెద్ది సినిమా మంచి విజయాన్ని అందుకుంది. జూన్ 3న పెద్ది సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్ షోలతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కాగా పెద్ది సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పెద్ది సినిమా ప్రీమియర్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసింది.

జూన్ 3న ఇండియావైడ్ గా జరిగిన ప్రీమియర్ల ద్వారా ‘పెద్ది ‘ రూ.21 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. తద్వారా,రూ.25 కోట్లకు పైగా వసూలు చేసిన ‘OG’ తర్వాత టాలీవుడ్‌లో పెద్ది రెండవ అతిపెద్ద ప్రీమియర్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఏపీలో రూ. 10కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని తెలుస్తుంది. అలాగే తెలంగాణాలో రూ 6కోట్లు, కర్ణాటక రూ. 3 కోట్లు మొత్తంగా ఇండియా వైడ్ గా రూ. 21 కోట్లు రాబట్టిందని తెలుస్తుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 38కోట్లు రాబట్టిందని టాక్ వినిపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన పెద్దికి ఉదయం ఆట నుంచే ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ల బయట పాలాభిషేకాలు, డప్పు చప్పుళ్లతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటుండగా.. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ఉత్సాహంగా పంచుకుంటున్నారు. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా  జాన్వికపూర్ నటించింది. అలాగే శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ అంటున్నారు ఆడియన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us