Rakul Preet Singh : అలా జరగడం ఇష్టం లేదు.. రిలేషన్ షిప్ పై రకుల్ ఆసక్తికర కామెంట్స్

|

May 23, 2022 | 6:16 PM

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య జోడు తగ్గించిందనే చెప్పాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ అందాల భామ.

Rakul Preet Singh : అలా జరగడం ఇష్టం లేదు.. రిలేషన్ షిప్ పై రకుల్ ఆసక్తికర కామెంట్స్
Rakul
Follow us on

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh )ఈమధ్య జోరు తగ్గించిందనే చెప్పాలి. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ అందాల భామ. రకుల్ తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంది. ఇక ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఇండియన్ 2మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే చాలా కాలంగా రకుల్ ప్రేమ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో తేలిపోతుందని టాక్ గాట్టిగా వినిపిస్తుంది. తాజాగా జాకీ భగ్నానీతో తనకున్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చింది రకుల్. రీసెంట్ గా ఓ ఇంట్రవ్యూలో రకుల్ మాట్లాడుతూ…

జాకీ తనకు చాలా మంచి స్నేహితుడని.. ఇద్దరి అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డామని చెప్పుకొచ్చింది. తమ మధ్య రిలేషన్ షిప్ స్టార్ట్ అయినప్పుడే అందరికి చెప్పేయాలనుకున్నాం. ఎందుకంటే తమ ప్రేమ వ్యవహారం బయట పెట్టకపోతే ఎవరికీ ఇష్టమొచ్చినట్టు వారు అవాస్తవాలు ప్రచారం చేస్తారు. ఆ ప్రచారాలతో ప్రశాంతతను కోల్పోతాం అని చెప్పుకొచ్చింది రకుల్. సెలెబ్రెటీల పైనే అందరి దృష్టి ఉంటుంది. అందుకే మా రిలేషన్ గురించి మేమే చెప్పేయాలని అనుకున్నాం అంది. అందరూ తమ పని గురించి మాట్లాడుకోవాలని.. తమ పర్సనల్ లైఫ్ గురించి కాదని తెలిపింది రకుల్. మన జీవితాల్లో తల్లిదండ్రులు, సిస్టర్స్, బ్రదర్స్ , ప్రెండ్స్  ఎలా ఉంటారో… అలాగే మనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా ఉంటాడని చెప్పింది రకుల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Major Movie: మేజర్ టీం అనుహ్య నిర్ణయం.. విడుదలకు ముందే ప్రీమియర్స్ షోస్..

Viral Photo: ముసుగు చాటున అందమైన వెన్నెలమ్మ.. ఆ కళ్లు చెప్పే మాటలకు అర్థాలేన్నో..! ఆమె ఎవరో తెలుసా ?..

Khushi Movie: సమంత.. విజయ్ దేవరకొండకు డైరెక్టర్ థ్యాంక్స్.. ఖుషి సినిమా నుంచి ఆసక్తికర అప్టేట్..