
చిన్న సినిమా గా వచ్చి సంచలన విజయం సాధించింది రాజు వెడ్స్ రాంబాయి. కొత్త డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ సినిమాతో అఖిల్ రాజ్, తేజస్విని రావు హీరో, హీరోయిన్లుగా పరిచయమయ్యారు. కొత్త వాళ్లైనా వీరు కూడా ప్రాణం పెట్టి నటించారంటూ హీరో, హీరోయిన్లపై ప్రశంసలు వస్తున్నాయి. ఇక సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ విలన్ పాత్రలో బాగా భయపెట్టాడు. సినిమాలో అతని నటనే హైలెట్ అని చెప్పుకోవచ్చు.
నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ ఇప్పటికే రూ.12 కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు సాయిలు. కొత్త డైరెక్టర్ అయినా తన టేకింగ్, మేకింగ్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షించాబడీ యంగ్ డైరెక్టర్. ప్రస్తుతం తన సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు సాయిల్. ఈ క్రమంలో వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా తన సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు.
2016 లో రాజు వెడ్స్ రాంబాయి సినిమా కథను రాసినప్పుడు మొదట రాహుల్ రామకృష్ణకు చెబుదామని అనుకున్నాడట సాయిలు. నటుడి ఫ్రెండ్ సహాయంతో సినాప్సిస్ రెడీ చేసి రాహుల్ రామకృష్ణకు కథ కూడా పంపించాడట. కానీ ఎటువంటి రిప్లై రాలేదట. ఆ తర్వాత ‘మేమ్ ఫేమస్’ హీరో సుమంత్ ప్రభాస్ కు కూడా ఇదే కథ చెప్పాడట. అతనికి ఈ స్టోరీ బాగా నచ్చిసిందట. సినిమా చేద్దామని కూడా అన్నాడట. కానీ వివిధ కారణాలతో సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత పెద్ద కాపు హీరో విరాట్ కర్ణ కూడా రాజు వెడ్స్ రాంబాయి కథను చెప్పాడట సాయిలు. వివిధ కారణాలతో అతను కూడా ఈ సినిమా చేసేందుకు అంగీకరించలేదట.
వీరితో పాటు స్టార్ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాలకు కూడా ఈ కథను వినిపించాడట డైరెక్టర్. అతను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో చివరకు అఖిల్ రాజ్ ను హీరోగా ఎంచుకుని సినిమాను మొదలు పెట్టారట. ఇక ఆ తర్వాత సంగతి అందరికీ తెలిసిందే.
#RajuWedsRambai audience is loving the movie, and the bookings are getting stronger day by day and it’s already looking like a big blockbuster. A perfect entertainer for the weekend!!👌🏻🔥 pic.twitter.com/roUZrMhMOs
— Adarsh (@adarshoff_) November 29, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి