చైనాలో రోబో 2.0 రిలీజ్‌కు కష్టాలు!

|

Jun 27, 2019 | 3:02 AM

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం ‘2.0’ గతేడాది రిలీజ్ అయింది.  భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.  తెలుగు వెర్షన్.. తమిళ వెర్షన్ కు నష్టాలు వచ్చినప్పటికీ ఓవరాల్ గా చూస్తే భారీ కలెక్షన్స్ వచ్చాయి. భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన కోలీవుడ్ చిత్రంగా నిలిచింది. అయితే సినిమాకు భారీగా ఖర్చు పెట్టడంతో నష్టాలు తప్పలేదు. ఈ […]

చైనాలో రోబో 2.0 రిలీజ్‌కు కష్టాలు!
Follow us on

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం ‘2.0’ గతేడాది రిలీజ్ అయింది.  భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.  తెలుగు వెర్షన్.. తమిళ వెర్షన్ కు నష్టాలు వచ్చినప్పటికీ ఓవరాల్ గా చూస్తే భారీ కలెక్షన్స్ వచ్చాయి. భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన కోలీవుడ్ చిత్రంగా నిలిచింది. అయితే సినిమాకు భారీగా ఖర్చు పెట్టడంతో నష్టాలు తప్పలేదు.

ఈ సినిమాను చైనాలో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనే ప్లాన్ తో కోసం ‘2.0’ నిర్మాతలు చైనా డిస్ట్రిబ్యూషన్ హౌస్ హెచ్ వై మీడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆ ఒప్పందం ప్రకారం ‘2.0’ చైనీస్ వెర్షన్ జూలై 12  న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు.  చైనా వ్యాప్తంగా ఈ సినిమాను అరవై వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేసేందుకు ముందుగా ప్లాన్ చేసుకున్నారు.  కానీ తాజాగా సమాచారం ప్రకారం హెచ్ వై మీడియా ఈ ‘2.0’ విడుదల చేసే ఆలోచనను విరమించుకుందట.  దీనికి ఒక కారణం అదే సమయంలో రిలీజ్ అవుతున్న హాలీవుడ్ చిత్రం ‘ది లయన్ కింగ్’.