AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే.. కమల్ హాసన్‌తో సినిమాకు రజనీకాంత్ భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?

దాదాపు 35 సంవత్సరాల తర్వాత రజనీకాంత్-కమల్ హాసన్ మళ్ళీ కలిసి వస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే కమల్ హాసన్ స్వయంగా రజనీకాంత్ తో కలిసి ఈ చిత్రంలో పెట్టుబడి పెడుతున్నారు. ఇది ఒక చారిత్రక చిత్రం అవుతుందని చెబుతున్నారు. కానీ రజనీకాంత్ ఒక్కడే తన స్నేహితుడికి ఎటువంటి రాయితీ ఇవ్వకుండా ఈ చిత్రానికి భారీ పారితోషికం తీసుకుంటున్నాడు.

తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే.. కమల్ హాసన్‌తో సినిమాకు రజనీకాంత్ భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?
Rajinikanth, Kamal Haasan
Basha Shek
|

Updated on: Feb 14, 2026 | 3:55 PM

Share

రజనీకాంత్, కమల్ హాసన్ భారతీయ సినిమా చరిత్రలో ఈ స్టార్స్ కు ప్రత్యేక పేజీలు ఉంటారు. ఈ నటులు దాదాపు ఐదు దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. తమ నటన, స్టైల్ తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఎన్నో సినిమాల్లోనూ నటించారు. దాదాపు 20కు పైగా సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ సుమారు 35 సంవత్సరాల తర్వాత ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేస్తున్నారు రజనీ, కమల్. ఈ మల్టీ స్టారర్ సినిమాను స్వయంగా కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ కు చెందిన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ భారీ బడ్జెత్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.అలాగే కమల్ కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారని పుకార్లు వచ్చాయి, కానీ అది ఇప్పుడు అబద్ధమని తేలింది. తాను ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం లేదని లోకేష్ స్వయంగా చెప్పారు. ‘మహారాజా’ చిత్రంతో భారీ హిట్ ఇచ్చిన నితిలన్ స్వామినాథన్ దీనికి దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది కూడా నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో ‘జైలర్’ తో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిన నెల్సన్ దిలీప్‌ కుమార్ ఇప్పుడు ఈ భారీ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను తీసుకున్నారని టాక్.

కాగా రజనీ- కమల్ ల సినిమా టైటిల్ ప్రోమో షూటింగ్ రేపు (ఫిబ్రవరి 14) పూర్తవుతుందని చెబుతున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు గురించి ఏదైనా అప్డేట్ కూడా రావొచ్చని చెబుతున్నారు. కాగా నెల్సన్ దిలీప్‌ కుమార్ ప్రస్తుతం ‘జైలర్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాతనే ఆయన కమల్- రజనీల ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉండేలా నెల్సన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మెగా ప్రాజెక్ట్ కోసం రజనీకాంత్ తీసుకుంటోన్న పారితోషికంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం రజనీకాంత్ 225 కోట్ల రూపాయల భారీ పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్నేహితుడు, నిర్మాత కమల్ హాసన్ కూడా రజనీకి ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
వంతార నుంచి కొల్హాపూర్‌కు తిరిగొచ్చిన ఏనుగు మాధురి
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. 75 ఏళ్ల వృద్ధుడి అరెస్ట్
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
వినాయకుడికి నైవేద్యంగా బెల్లం పాల తాలికలు..
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
పాలకూర రోజూ తింటే ఏం జరుగుతుంది? వీరు మాత్రం ఆచితూచి తినాత్సిందే
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
‘మహేంద్రగిరి వారాహి’ రివ్యూ క్లియర్ కట్‌గా..
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
శని అతివక్రంతో వీరికి జాక్‌పాట్..! అదృష్టం తలుపు తట్టడం ఖాయం
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
రాత్రిపూట పదేపదే మెలకువ వస్తుందా? లైట్‌ తీసుకుంటే రిస్క్‌ మీకే..
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
భారీ క్రెయిన్‌లతో 48 గంటలు కష్టపడ్డా.. ఇంచు కూడా కదలని విగ్రహం!
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?
కుమారుడు లేకపోతే శ్రాద్ధం ఎవరు చేయాలి? గరుడ పురాణంలో ఏం చెప్పారు?