Kalki 2898 AD: ఇండియన్ సినిమాకు మరో స్థాయికి తీసుకెళ్లారు.. కల్కి సినిమాపై రజినీకాంత్ రియాక్షన్..
భారతీయ పురాణాలకు, సైన్స్ ఫిక్షన్ జత చేస్తూ తెరకెక్కించిన ఈ అద్భుతమైన విజువల్ వండర్, ఊహించని పాత్రలు, ట్విస్టులు చూసి ఫిదా అవుతున్నారు అడియన్స్. నాగ్ అశ్విన్ మేకింగ్, విజన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే కల్కి సినిమాపై రాజమౌళి, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈసినిమాపై సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున రియాక్ట్ అయ్యారు. కల్కి చిత్రయూనిట్ పై పొగడ్తలు కురిపించారు.
తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిస్టారికల్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. భారతీయ పురాణాలకు, సైన్స్ ఫిక్షన్ జత చేస్తూ తెరకెక్కించిన ఈ అద్భుతమైన విజువల్ వండర్, ఊహించని పాత్రలు, ట్విస్టులు చూసి ఫిదా అవుతున్నారు అడియన్స్. నాగ్ అశ్విన్ మేకింగ్, విజన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే కల్కి సినిమాపై రాజమౌళి, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈసినిమాపై సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున రియాక్ట్ అయ్యారు. కల్కి చిత్రయూనిట్ పై పొగడ్తలు కురిపించారు. కల్కి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు.
“కల్కి సినిమా అద్భుతంగా ఉంది. ఇండియన్ సినిమాను నాగ్ అశ్విన్ మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో నటించిన వారికి ఈ సినిమాకు పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమా రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటూ రజినీకాంత్ ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు దర్శకుడు నాగ్ అశ్విన్ రిప్లై ఇస్తూ “మాటలు రావడం లేదు సర్..టీమ్ అందరి తరపున కృతజ్ఞతలు” అని చెప్పారు.
Sir… speechless ….blessed….from our whole team 🙏 🙏🙏🙏🙏 https://t.co/PGg4bFAbf8
— Nag Ashwin (@nagashwin7) June 29, 2024
“కల్కి టీమ్ అందరికీ అభినందనలు. నాగీ మీరు మమ్మల్ని మరోక స్థాయికి తీసుకెళ్లారు. పురాణాలు, చరిత్రను కలుపుతూ అల్లుకున్న అద్భుతమైన కల్పన కల్కి. అసలైన మాస్ హీరో అమితాబ్. మీరు నిప్పులు కురిపిస్తున్నారు. సీక్వెల్లో కమల్ సర్ ను చూడటానికి వేచి చూస్తున్నాను. ప్రభాస్ నువ్వు మరోసారి సత్తా చాటావు. దీపికా మీరు అద్భుతంగా నటించారు. మీరంతా కలిసి ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి నిరూపించారు” అంటూ ప్రశంసించారు.
Congratulations to the team of Super duper #Kalki2898AD!! Naagi you took us to another time and another place . entwining fiction with mythology and history so effortlessly!! Amith Ji, the original mass hero… Sir, you are on fire🔥🔥🔥🔥🔥 can’t wait to see Kamalji in the…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 29, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.