Jailer First Day Collections: ‘జైలర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద తలైవా భీభత్సం.. రికార్డ్స్ బ్రేక్ చేసిన సూపర్ స్టార్..

తలైవా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జైలర్ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళీ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, తమన్నా కీలకపాత్రలలో నటించారు. ఆగస్ట్ 10న విడుదలైన ఈ సినిమా తొలిరోజే రికార్డ్స్ బ్రేక్ చేసింది.

Jailer First Day Collections: జైలర్ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద తలైవా భీభత్సం.. రికార్డ్స్ బ్రేక్ చేసిన సూపర్ స్టార్..
Jailer Movie First Day Collections

Updated on: Aug 11, 2023 | 6:14 PM

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు తెలియని వారుండరు. తమిళ్ స్టార్ హీరో అయినప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంది అభిమానులున్న హీరోలలో ఆయన ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు తలైవా. ఏడు పదుల వయసులోనూ ఆయన ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తలైవా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జైలర్ చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళీ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, తమన్నా కీలకపాత్రలలో నటించారు. ఆగస్ట్ 10న విడుదలైన ఈ సినిమా తొలిరోజే రికార్డ్స్ బ్రేక్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ తొలిరోజే రూ.49 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.ఈ చిత్రానికి దాదాపు 78 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో రూ.25 కోట్లు.. కర్ణాటకలో రూ.11 కోట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు రాబట్టినట్లుగా అంచనా. దాదాపు రెండేళ్ల తర్వాత రజినీ నటించిన ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

అమెరికాలో ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి 1.450మిలియన్ డాలర్లు రాబట్టింది. డైరెక్టర్ నెల్సన్ ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ చిత్రం ఆయన గత సినిమా బీస్ట్ సాధించిన 1.375 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ రికార్డ్ ను బ్రేక్ చేసిందని టాక్. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో కావాలా సాంగ్, హుకుం సాంగ్ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.