SS Rajamouli: జక్కన్నను కుట్టిన హాలివుడ్ పురుగు.. రోమాలు నిక్కబొడుచుకునేలా మహేశ్‌తో అడ్వంచరస్ డ్రామా

| Edited By: Ravi Kiran

Jan 20, 2023 | 8:31 AM

రాజమౌళిని హాలీవుడ్ పురుగు కుట్టేసిందా..? గత మూడు నాలుగు నెలలుగా అమెరికాలోనే ఉన్న జక్కన్న.. ఆ ఊహా లోకంలోనే విహరిస్తున్నారా..? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ లాంటి దర్శకులను కలిసిన తర్వాత దర్శక ధీరుడి ఫ్యూచర్ ప్లానింగ్ అంతా మారిపోయిందా..? మహేష్ బాబు సినిమా ఎలా ఉండబోతుంది..? ఇది అసలు ఇండియన్ సినిమానా లేదంటే ఇంటర్నేషనల్ ప్రాజెక్టా..?

SS Rajamouli: జక్కన్నను కుట్టిన హాలివుడ్ పురుగు.. రోమాలు నిక్కబొడుచుకునేలా మహేశ్‌తో అడ్వంచరస్ డ్రామా
Ss Rajamouli
Follow us on

ఆర్నెళ్ళు సావాసం చేస్తే వాళ్లు వీళ్ళవుతారని ఊరికే అనలేదు పెద్దలు. ఇక్కడ రాజమౌళిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కామేరూన్, స్పీల్ బర్గ్‌కు ఇండియన్ సినిమా గురించి ఎంత తెలిసిందో తెలియదు కానీ.. రాజమౌళికి మాత్రం హాలీవుడ్ పురుగు బాగానే కుట్టేసింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చాక.. ఈ దర్శకుడి చూపంతా హాలీవుడ్‌పైనే ఉంది. త్వరలోనే తన జెండా అక్కడ పాతాలని చూస్తున్నారు జక్కన్న. ఇండియాలోనే మరే దర్శకుడికి సాధ్యం కాని స్థాయిలో శిఖరాలు అధిరోహిస్తున్నారు రాజమౌళి. ఎవరైనా దర్శకుడు ఎదిగితే ఆయన కెరీర్‌కు మాత్రమే యూజ్ అవుతుంది.. కానీ ఇక్కడ రాజమౌళి వేసే ప్రతీ అడుగు ఇండియన్ సినిమాను మరో మెట్టు పైకి ఎక్కిస్తుంది. గత కొన్ని నెలలుగా అమెరికాలోనే ఉన్న రాజమౌళికి.. హాలీవుడ్ పద్దతులు బాగా ఒంట బట్టేసాయి. అక్కడి మేకింగ్ స్టైల్ గురించి అవగాహన వచ్చేసింది.

టాలీవుడ్ నుంచి తన స్థాయి బాలీవుడ్‌కు పెంచుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్లాలని కలలు కంటున్నారు. దానికోసమే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారీ దర్శక ధీరుడు. దానికి మహేష్ బాబు సినిమానే పునాదిగా వాడుకోవాలని చూస్తున్నారు జక్కన్న. సూపర్ స్టార్ సినిమా పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ప్లస్ యాక్టర్స్‌తోనే ప్లాన్ చేస్తున్నారు ఈయన. అంతేకాదు విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత భారీగా ఉండబోతున్నాయి.

ఆఫ్రికన్ నేపథ్యంలో సాగే అడ్వంచరస్ డ్రామాగా మహేష్ సినిమా ఉండబోతుంది. ఇందులో ట్రావెలర్‌గా నటించబోతున్నారు సూపర్ స్టార్. ఎలాంటి ఎమోషన్స్ లేని పాత్ర ఇది. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా మహేష్ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. దీనికోసం బడ్జెట్ లిమిట్స్ సైతం పెట్టుకోవట్లేదీయన. మరి రాజమౌళి కలల్నీ మహేష్ సినిమా ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి