
ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వి ఎల్ క్రియేషన్స్ మరియు మధుపాల మహా మూవీస్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు అలాగే మధుపాల సురేష్ గార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం టార్టాయిస్. అయితే తాజాగా హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్బంగా చిత్ర టీమ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ సందర్బంగా యూనిట్ సభ్యులు మాట్లాడుతూ “ఈ రోజు మా హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు. మా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. మా “టార్టాయిస్” చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ. రాజ్ తరుణ్ 25వ చిత్రం గా కెరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ మరియు హీరోయిన్ అమృత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్ ప్లే తో డిఫరెంట్ కథ తో మంచి థ్రిల్లర్ చిత్రం ఇది.
“హీరో కి నిద్రలో నడిచే అలవాటు ఉంది, నిద్రలో నడుచుకుంటూ వెళ్లి కొన్ని మర్డర్స్ చేస్తాడు.తర్వాత ఏమి జరుగుతుంది“ అనే కాసెప్ట్ తో ఈ చిత్రానికి చిత్రీకరించాం. షూటింగ్ అంత పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల చేస్తాం” అని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో రాజ్ తరుణ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు రాజ్ తరుణ్ అభిమానులు.