Pooja Hegde: సెట్ కాదు.. కట్ అనుకున్నారా.. ? ప్రభాస్, పూజా హెగ్డే మధ్య విభేదాలు నిజమేనా ?

|

Sep 22, 2021 | 6:16 PM

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‏గా మారాలంటే నటనతో పాటు.. కాసింత అదృష్టం కూడా ఉండాలంటారు. అయితే కొందరికి మాత్రం

Pooja Hegde: సెట్ కాదు.. కట్ అనుకున్నారా.. ? ప్రభాస్, పూజా హెగ్డే మధ్య విభేదాలు నిజమేనా ?
Follow us on

తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‏గా మారాలంటే నటనతో పాటు.. కాసింత అదృష్టం కూడా ఉండాలంటారు. అయితే కొందరికి మాత్రం స్టార్‏డమ్ కంటే ముందే నెగిటివిటి వచ్చేస్తుంది. మరికొందరికి సక్సెస్‏ఫుల్‍గా దూసుకుపోతున్న సమయంలో అనుహ్యాంగా చిక్కులు వచ్చి పడుతుంటాయి. ఇక సినిమా పరంగా హీరోహీరోయిన్స్ మధ్య విభేధాలు తలెత్తడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కొంతమంది స్టార్ హీరోహీరోయిన్స్ మధ్య సినిమా పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ మనస్పర్థలు కలుగుతుంటాయి. టాప్ హీరోయిన్స్ చేసే పొరపాట్లే వారి కెరీర్ పై దెబ్బ పడుతుంది. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు ఈ అమ్మడుపై నెగిటివిటి పెరిగినట్టుగా తెలుస్తోంది. వరుస ఆఫర్లను అందుకుంటూ.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా గురించి గత కొద్ది రోజులుగా ఆసక్తికరమైన టాక్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డే మధ్య విభేధాలు ఉన్నాయని.. పూజా హెగ్డే తీరుతో ప్రభాస్ విసిగిపోయి.. తనపై ఆగ్రహంగా ఉన్నాడని.. అంతేకాకుండా.. చిత్రయూనిట్ సైతం ఈ అమ్ముడి తీరుపై విసుగ్గా ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

పూజా హెగ్డే షూటింగ్ సెట్‏లో ఉండే ప్రవర్తన కాస్త భిన్నంగా ఉంటుందని.. అందుకే ఆమె పై చిత్రయూనిట్‏తోపాటు.. ప్రభాస్ కూడా ఆగ్రహంగా ఉన్నారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే వీరిద్దరి ఉండాల్సిన సీన్లను రాధేశ్యామ్ టీం విడివిడిగా చిత్రీకరించిందని.. టాక్. తాజాగా ఈ వార్తలపై రాధేశ్యామ్ చిత్రయూనిట్ స్పందించింది. పూజా హెగ్డే, ప్రభాస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. అలాంటి వార్తలలో అసలు వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. అలాగే పూజా హెగ్డే మంచి టైం సెన్స్ పాటిస్తుందని.. ఆమెతో పనిచేయడం చాలా ఈజీగా ఉంటుందని నిర్మాతలు చెప్పుకొచ్చారు.

ఇక వీరిద్దరి మధ్య వచ్చే ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతంగా ఉంటాయని.. పూజా, ప్రభాస్‏ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. యూరప్ బ్యాక్ డ్రాప్‎లో పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, బ్యానర్లపై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, సచిన్, కేడ్కర్, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Also Read: Maa Elections 2021: మా ఎన్నికలకు సర్వం సిద్ధం.. రంగంలోకి ఆ సీనియర్ నటులు.. మంచు విష్ణు ప్యానల్ రివీల్. ..

SaiPallavi: ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా.. లవ్ స్టోరీ గురించి హీరోయిన్ సాయి పల్లవి ముచ్చట్లు..