PVR-Inox: సినిమా తెర ప్రపంచంలో బిగ్‌ డీల్‌.. పార్ట్నర్‌లుగా మారిన పీవీఆర్‌-ఐనాక్స్‌ లీజర్‌..

| Edited By: Rajeev Rayala

Mar 28, 2022 | 2:20 PM

ఇండియన్‌ గోల్డెన్‌ స్క్రీన్‌పై బిగ్‌ డీల్‌. వాల్డ్‌ టాప్‌ థియేటర్‌ గ్రూపులో చేరిపోయాయి. ప్రముఖ మల్టిప్లెక్స్‌గా పేరున్న పీవీఆర్‌-ఐనాక్స్‌ లీజర్‌ సంస్థలు విలీనమయ్యాయి.

PVR-Inox: సినిమా తెర ప్రపంచంలో బిగ్‌ డీల్‌.. పార్ట్నర్‌లుగా మారిన పీవీఆర్‌-ఐనాక్స్‌ లీజర్‌..
Pvr
Follow us on

ఇండియన్‌ గోల్డెన్‌ స్క్రీన్‌పై బిగ్‌ డీల్‌. వాల్డ్‌ టాప్‌ థియేటర్‌ గ్రూపులో చేరిపోయాయి. ప్రముఖ మల్టిప్లెక్స్‌గా పేరున్న పీవీఆర్‌ (PVR)-ఐనాక్స్‌ (Inox) లీజర్‌ సంస్థలు విలీనమయ్యాయి. ఇక ప్రేక్షకులకు పీవీఆర్‌-ఐనాక్స్‌ థియేటర్స్‌గా స్క్రీన్స్‌ రన్‌ కానున్నాయి. ఈ కొత్త ఒప్పందంతో భారత్‌లోనే పెద్ద చైన్‌ కంపెనీగా అవుతరించనుంది. ఇండియన్‌ గోల్డెన్‌ స్క్రీన్‌పై బిగ్‌ డీల్‌. వాల్డ్‌ టాప్‌ థియేటర్‌ గ్రూపులో చేరిపోయాయి. ప్రముఖ మల్టిప్లెక్స్‌గా పేరున్న పీవీఆర్‌-ఐనాక్స్‌ లీజర్‌ సంస్థలు విలీనమయ్యాయి. ఇక ప్రేక్షకులకు పీవీఆర్‌-ఐనాక్స్‌ థియేటర్స్‌గా స్క్రీన్స్‌ రన్‌ కానున్నాయి. ఈ కొత్త ఒప్పందంతో భారత్‌లోనే పెద్ద చైన్‌ కంపెనీగా అవుతరించనుంది. దేశంలో కూడా మరో కీల భాగస్వామ్య ఒప్పందం జరిగింది. అది దేశంలోనే బిగ్గెస్ట్‌ సంస్థగా అవతరించి.. ప్రపంచంలోనే 11వ స్థానంలో నిలవబోతోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా బిగ్‌ అండ్‌ స్మాల్‌ థియేటర్లతో ఇప్పటికే ఫ్యాన్స్‌లో ముద్ర వేసుకున్న PVR, ఐనాక్స్‌ లీజర్‌ రెండు సంస్థలు ఈ బిగ్‌ డీల్‌తో ఏకమయ్యాయి. ఈ ఒప్పందానికి రెండు కంపెనీల బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదించారు. ఐనాక్స్‌ 10శాతం ఈక్విటీ షర్లుకు PVRకు చెందిన 3శాతం ఈక్విటీ షేర్లు మార్పిడి జరిగింది. ఈ విలీనం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద స్క్రీన్‌ గ్రూప్‌గా అవతరిస్తుంది. ప్రపంచంలో కూడా టాప్‌ స్క్రీన్‌లో వీటికి చోటు లభిస్తుంది. ప్రపంచంలో టాప్‌లో ఉన్న మెక్సికో సినీ పొలీస్‌కు గట్టి పోటీ నివ్వనుంది ఈ కొత్త డీల్‌. ప్రపంచంలో లెవన్త్‌ ప్లేస్‌లోఉంటుంది. దేశ వ్యాప్తంగా ఈ రెండు సంస్థలకు 1500 కంటే ఎక్కువ స్క్రీన్‌ల నెట్‌వర్క్ ఉంది. ఈ విలీనం తర్వాత.. INOX ప్రమోటర్లు.. PVR ప్రస్తుత ప్రమోటర్లతో పాటు.. విలీన సంస్థలో సహ-ప్రమోటర్లుగా మారుతారు. ఈ భాగస్వామ్య ఒప్పంద తర్వాత కొత్త కంపెనీ డైరెక్టర్ల బోర్డులో ఉండే 10 మంది డైరెక్టర్లలో సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. ఇప్పటికే కొత్త కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అజయ్‌ బిజిలీని నియమించగా.. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సంజీవ్‌ కుమార్‌, బోర్డ్‌ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా పవన్‌ కుమార్‌ జైన్‌ బాధ్యతలు చేపట్టారు. సిద్దార్థ్‌ జైన్‌ జాయింట్‌ కంపెనీలో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ నాన్‌- ఇండియన్‌ సంయుక్త సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉంటారు. విలీనం తర్వాత, PVR ప్రమోటర్లు 10.62శాతం వాటాను కలిగి ఉంటారు. అయితే INOX ప్రమోటర్లు సంయుక్త సంస్థలో 16.66శాతం వాటాను కలిగి ఉంటారు. ఈ విలీనం దేశంలో రెండు కంపెనీల మనుగడను బలోపేతం చేస్తుంది. కొత్త కంపెనీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 109 నగరాల్లో 341 ప్రాపర్టీలతో 1546 స్క్రీన్‌లతో దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్‌ ఎగ్జిబిషన్‌ కంపెనీగా అవరిస్తోంది.

Also Read: Viral Photo: ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?.. అబ్బాయిల కలల రాకుమారి మన తెలుగమ్మాయి..

KGF 2 Trailer: కేజీఎఫ్ 2 ట్రైలర్ వచ్చేసింది.. ఇక ఫ్యాన్స్‏కు పూనకాలే..

RRR Movie: ఆ థియేటర్‌లో జక్కన్న సినిమాను ఫస్ట్‌ హాఫ్‌ మాత్రమే వేసి ఆపేశారు.. కారణమేంటంటే..

Varsha Bollamma: చూపుతిప్పుకోనివ్వని అందాల తార వ‌ర్ష బొల్ల‌మ్మ‌. పాప ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!