కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) నటించిన చివరి చిత్రం జేమ్స్ (James). ఈ సినిమా షూటింగ్ పూర్తై.. పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న సమయంలోనే పునీత్ గుండెపోటుతో మరణించారు. దీంతో కన్నడ చిత్రపరిశ్రమ తీవ్ర శోకసంధ్రంలో మునిగిపోయింది. ఒక్క కన్నడ పరిశ్రమ అనే కాదు.. ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ పునీత్‌ని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారంటే అతిశయోక్తి కానే కాదు. గతేడాది అక్టోబర్‌లో పునీత్ ఈ లోకాన్ని విడిచిపోయాడు. ఇప్పటికీ అప్పు జ్ఞాపకాలను తలుచుకుంటూ సోషల్ మీడియాలో అతనికి సంబంధించిన వీడియోస్.. ఫోటోస్ షేర్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. అప్పు నటించిన చివరి చిత్రం జేమ్స్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా మహాశివరాత్రి సందర్భంగా.. ఈ సినిమా నుంచి ట్రేడ్ మార్క్ అనే పాటను విడుదల చేశారు మేకర్స్. విడుదలైన కాసేపటికే ఈ ఈ సాంగ్ నెట్టింట్లో దూసుకుపోతుంది. ఈ పాటను ఎంసీ విక్కీ, అదితి సాగర్, చందన్ శెట్టి, షర్మిల, యువరాజ్ కుమార్ మరియు చరణ్ రాజ్ పాడారు. చేతన్ కుమార్ రాసిన సాహిత్యానికి చరణ్ రాజ్ సంగీతం అందించాడు. ఈ పాటను 5గురు సింగర్స్ ఆలపించారు. ఇందులో పునీత్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పునీత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read: Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు మరో సర్ప్రైజ్.. రాధేశ్యామ్ ప్రమోషన్స్ షూరు అయ్యేది అప్పుడే..
Samantha: రష్యా దాడులపై స్పందించి నటి సమంత.. ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్.