Yashoda: ఇకపై సినిమాలో ఆ పదం కనిపించదు.. క్లారిటీ ఇచ్చేసిన యశోద ప్రొడ్యూసర్..

|

Nov 29, 2022 | 9:54 PM

సమంత నటించిన యశోద సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ విషయం తెలిసిందే.  శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు...

Yashoda: ఇకపై సినిమాలో ఆ పదం కనిపించదు.. క్లారిటీ ఇచ్చేసిన యశోద ప్రొడ్యూసర్..
Yashoda
Follow us on

సమంత నటించిన యశోద సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ విషయం తెలిసిందే.  శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. ముఖ్యంగా సామ్ నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో సామ్ ప్రాణం పెట్టి చేసిందని.. ఈ మూవీ కోసం ఆమె ఎంత కష్టపడిందో.. తెరపై కనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీపై వివాదాలు వస్తున్నాయి. వాటిని చెక్ పెడుతూ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలో ఈవా అనే పేరు కాన్సెప్ట్ ప్రకారమే పెట్టామన్న ఆయన.. వేరొకరి మనో భావాలను దెబ్బతీయడానికి కాదన్నారు. ఈవా వారిని తాను కలిశానని, జరిగింది చెప్పానని వివరించారు.

‘ఇక ఫ్యూచర్ లో ఈవా అనే పదం యశోద సినిమాలో కనపడదు. మా నిర్ణయాన్ని ఇవా వారు కూడా అంగీకరించారు. ఈ సమస్యకు ఇంతటితో పరిష్కారం అయ్యింది. ఇది తెలియక చిన్న దిస్త్రబెన్స్ మాత్రమే’ నని నిర్మాత శివలెంక ప్రసాద్ అన్నారు. యశోద లో తమ హాస్పిటల్ పేరు వాడటంతో తాము హర్ట్ అయ్యామని ఈవా హాస్పిటల్ ఎండి మోహన్ రావు అన్నారు. ‘నిర్మాత చాలా తొందరగా సమస్యను క్లియర్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యింది. డాక్టర్స్ అందరూ కూడా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటారు. సినిమా వాళ్ళు కూడా ప్రొఫెషన్ ను గౌరవించాలి. ఇప్పటికీ ఎవరికైనా ఏదైనా జరిగితే ఠాకూర్ సినిమా లాగా జరిగింది అంటారు. సినిమా చాలా బలమైన మాధ్యమం. కాబట్టి వాస్తవాలకు దగ్గరగా ఉండాలని’ కోరారు.

ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా ‘యశోద’. ఈ సినిమాలో సమంత నటనపై సినీ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో ఇవా హస్పిటల్‌ పేరు వాడటాన్ని వ్యతిరేకిస్తూ ఆస్పత్రి వర్గాలు ఇటీవల కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టు ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు యశోద ఓటీటీ విడుదల ఆపేయాలని ఆదేశాలిచ్చింది. తాజాగా ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. సినిమా మేకర్స్‌ ఇక పై ఇవా పేరు చిత్రంలో కనపడదు అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..