Devi Movie: దేవి సినిమా షూటింగ్‌లో ఆమెకు పాము కాటు.. హీరోయిన్ చెప్పిన మాటలకు షాకయ్యాం.. నిర్మాత కామెంట్స్..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ సినిమాల్లో దేవి ఒకటి. అప్పట్లో ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ తగ్గడం లేదు. ఈ మూవీ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. అలాగే ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నిర్మాత ఎంఎస్ రాజు.

Devi Movie: దేవి సినిమా షూటింగ్‌లో ఆమెకు పాము కాటు.. హీరోయిన్ చెప్పిన మాటలకు షాకయ్యాం.. నిర్మాత కామెంట్స్..
Vanitha Vijay Kumar

Updated on: May 08, 2026 | 11:43 AM

తెలుగు సినిమా ప్రపంచంలో ఎవర్ గ్రీన్ హిట్ సినిమాలు చాలా ఉన్నాయి. అందులో దేవి ఒకటి. అప్పట్లో ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. కోలీవుడ్ నటి వనీతా విజయ్ కుమార్, భానుచందర్, ప్రేమ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. 1999లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది వనీతా విజయ్ కుమార్. ఆ తర్వాత మరో మూవీ చేయలేదు. కానీ తమిళంలో మాత్రం పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె కూతురు జోవిక విజయ్ కుమార్ కథానాయికగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యింది. గతేడాది తమిళ బిగ్ బాస్ షోలో పాల్గొన్న జోవిక.. ఇప్పుడు తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కానుంది. డైరెక్టర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న అగధ సినిమాలో ఆమె నటిస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కమ్ నిర్మాత ఎంఎస్ రాజు మాట్లాడుతూ దేవి సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేవి సినిమా షూటింగ్ సమయంలో వనిత విజయ్ కుమార్ ను పాము కాటేసిందని…. అప్పుడు తామంతా ఎంతో కంగారు పడిపోయామని అన్నారు. కానీ వనితా మాత్రం ఎలాంటి భయం లేకుండా అమ్మవారే తనను కాపాడుతుందని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఆమె ఎంత ధైర్యవంతురాలో చెప్పాలంటే ఈ ఒక్క సంఘటన చాలని.. ఆమె ఎంతో ధైర్యవంతురాలని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

దేవి సినిమాకు ఎంఎస్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇక అగధ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో జోవిక కథానాయిక హరిణి పాత్రలో కనిపించనుండగా.. హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించారు. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

Follow Us