Vakeel Saab: దిల్‌రాజు నమ్మకం ఒమ్ము కాలేదు.. ఫలించిన టాప్‌ ప్రొడ్యూసర్‌ డ్రీమ్‌.. ఖుషీ ఖుషీగా..

|

Apr 09, 2021 | 8:46 AM

Vakeel Saab: టాలీవుడ్‌లో టాప్‌ ప్రొడ్యూసర్‌లలో దిల్‌రాజు మొదటి స్థానంలో ఉంటారు. నిర్మాత అంటే కేవలం డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తి కాదని.. సినిమా కథలో భాగస్వామ్యమవ్వాలని భావించే వారిలో దిల్‌రాజు..

Vakeel Saab: దిల్‌రాజు నమ్మకం ఒమ్ము కాలేదు.. ఫలించిన టాప్‌ ప్రొడ్యూసర్‌ డ్రీమ్‌.. ఖుషీ ఖుషీగా..
Dil Raju Vakeelsaab
Follow us on

Vakeel Saab: టాలీవుడ్‌లో టాప్‌ ప్రొడ్యూసర్‌లలో దిల్‌రాజు మొదటి స్థానంలో ఉంటారు. నిర్మాత అంటే కేవలం డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తి కాదని.. సినిమా కథలో భాగస్వామ్యమవ్వాలని భావించే వారిలో దిల్‌రాజు మొదటి వరుసలో ఉంటారు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన రాజు.. బడా నిర్మాతగా మారారు. ఏకంగా సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని టాలీవుడ్‌ టాప్‌ హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా దిల్‌ రాజు నిర్మాణంలో పవన్‌ కళ్యాణ్ హీరోగా ‘వకీల్‌ సాబ్‌’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచే ఆకట్టుకుంటోంది. థియేటర్ల వద్ద పవన్‌ అభిమానుల సందడి ఆకాశాన్ని తాకుతోంది. దీంతో దిల్‌ రాజు తన ఖాతాలో మరో భారీ విజయాన్ని వేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక నిర్మాతగా మారినప్పటి నుంచి పవన్‌తో ఓ సినిమా తీయాలని దిల్‌ రాజుకు కోరిక ఉండేదని ఇటీవల జరిగిన వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చెప్పుకొచ్చారు. వకీల్‌సాబ్‌ చిత్రంతో ఈ కల నిజం కాగా.. భారీ హిట్‌ను సొంతం చేసుకోవడం మరో విశేషం. ఇక ఈ సినిమా కోసం దిల్‌రాజు భారీగా ఖర్చు చేశారు. ఓవైపు రాజకీయలు, మరోవైపు షూటింగ్‌లో పాల్గొన్న పవన్‌ కోసం దిల్‌రాజు ఏకంగా ప్రత్యేక విమానాన్ని సమకూర్చారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసందే. ఈ లెక్కన చూసుకుంటే రాజు.. ఈ సినిమాపై ఎంత నమ్మకంతో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో దిల్‌ రాజు వకీల్‌ సాబ్‌పై పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాలేదని చెబుతున్నారు. ఇక తన అభిమాన హీరోతో హిట్‌ కొట్టడంతో దిల్‌రాజు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. తాజాగా గురువారం రాత్రి హైదారబాద్‌లో ఏర్పాటు చేసిన బెనిఫిట్‌ షోలో పాల్గొన్న ఈ టాప్‌ ప్రొడ్యూసర్‌ చిందులు వేశారు. సగటు అభిమానిలా మారిపోయి పేపర్లు విసురుతూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది.

బెనిఫిట్‌ షోలో సందడి చేస్తోన్న దిల్‌రాజు..

Also Read: ‘వకీల్ సాబ్’ ట్విట్టర్ రివ్యూ.. పవన్ ప్రభంజనం మొదలు.. ఫ్యాన్స్‌కు పూనకాలు.. రికార్డుల వేట.!

పవన్ అభిమానుల పండగ మొదలైంది.. ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్

Rajinikanth: ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలు దేరిన రజనీకాంత్‌.. ఎందుకో తెలుసా..?