Priya Prakash Varrier Interesting Comments: కేవలం 20 సెకన్ల నిడివిగల ఓ వీడియోతో ఒక్క రాత్రిలో సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుంది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ వీడియో దెబ్బకు ఏకంగా ‘లవర్స్ డే’ సినిమాలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను పెంచి మళ్లీ షూటింగ్ చేశారంటేనే ప్రియా ఎక్స్‌ప్రెషన్స్‌కు ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు భాషల నుంచి ఆఫర్లు అందుకుంటున్న ప్రియా.. తొలిసారి హీరో నితిన్ సరసన నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. ‘చెక్’ సినిమాలో నటిస్తోన్న ఈ అందాల భామ ఇప్పటికే ఫస్ట్ లుక్, లిరికల్ వీడియోల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే చెక్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారింది. ఇందులో భాగంగానే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ బ్యూటీ.. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తీసిన ‘మనమంతా’ చిత్రాన్ని మలయాళంలో చూసిన ప్రియా.. ఆ సినిమాకు ఫిదా అయ్యిందట. దీంతో ‘చెక్’ సినిమా కోసం దర్శకుడు సంప్రదించగానే కథ కూడా వినకుండా ఓకే చెప్పేసిందంట. ఇక ఈ సినిమాలో తన పాత్ర పేరు యాత్ర అని చెప్పిన ఈ వింకిల్ గాళ్.. సినిమాలో ఈ పాత్ర కీలకపాత్ర పోషిస్తున్నాని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చిన ప్రియా.. కొన్ని సినిమాల తర్వాత తెలుగులో డబ్బింగ్ చెప్పడంతో పాటలు కూడా పాడాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది. ఇక ప్రియా ప్రస్తుతం.. తెలుగులో ‘ఇష్క్’తో పాటు హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు తెలుగులో మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మరి ‘చెక్’ సినిమాతో ప్రియా.. తెలుగులో పాగా వేస్తుందో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.