Mosagallu movie : టాలీవుడ్ హీరో మంచు విష్ణూ మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. త్వరలో మోసగాళ్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నడు. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ‘మోసగాళ్లు’ సినిమాలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. మహాగా శివరాత్రి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం.
బ్యాంకును కొల్లగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ కాజల్ విష్ణు చెల్లిగా నటిస్తోంది. కాజల్ తన చెల్లిగా నటిస్తుండడంపై కొందరు హీరోలు కామెంట్ చేస్తున్నారని చెప్పాడు విష్ణు. ముందుగా ఈ సినిమాలో కాజల్ ప్లేస్ లో బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీజింతాను సంప్రదించారట. ప్రీతీజింతా గతంలో తెలుగులో పలుసినిమాల్లో నటించింది. అయితే అనుకోని కారణాల వాళ్ళ ఆమె ఈ సినిమా చేయలేనని సున్నితంగా తిరస్కరించిందట. ఆ వెంటనే కాజల్ ను సంప్రదించారట. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కాజల్ చెల్లెలు పాత్రలో నటించడానికి వెంటనే ఓకే చెప్పిందని విష్ణు తెలిపాడు. అయితే మా సినిమాల్లోని హీరోయిన్ ను సిస్టర్ గా మార్చేశావా? అని ఫన్నీగా కొంతమంది హీరోలు విష్ణును అడుగుతున్నారట. ఇక ఈ మూవీలో విష్ణు పాత్రకంటే కాజల్ పాత్రే చాలా కీలకంగా ఉంటుందని తెలిపాడు విష్ణు. ఏవీఏ ఎంటర్ టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తన సినిమాను ఫ్రీగా ప్రేక్షకులకు చూపించబోతున్నాడట ఈ మంచు హీరో. కేవలం 10 నిమిషాల సినిమాను రిలీజ్ కు ముందే చూపిస్తాడట. హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి మొదటి పది నిమిషాల సినిమాను ప్రసారం చేస్తారట.
మరిన్ని ఇక్కడ చదవండి :
Nikhil Siddharth : వరుస సినిమాలతో జోరుమీదున్న యంగ్ హీరో… మెగాహీరో కథతో సినిమా చేస్తున్న నిఖిల్..