Richa Gangopadhyay: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

రానా దగ్గుబాటి అరంగేట్రం చేసిన లీడర్‌ సినిమాతోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది రిచా గంగోపాధ్యాయ (Richa Gangopadhyay).

Richa Gangopadhyay: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి హీరోయిన్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..
Richa Gangopadhyay

Updated on: Apr 27, 2022 | 4:34 PM

రానా దగ్గుబాటి అరంగేట్రం చేసిన లీడర్‌ సినిమాతోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది రిచా గంగోపాధ్యాయ (Richa Gangopadhyay). ఆ తర్వాత మిరపకాయ్‌, మిర్చి, నాగవల్లి, భాయ్‌, సారొచ్చారు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా ప్రభాస్‌ హీరోగా నటించిన మిర్చి (Mirchi) సినిమాలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. తెలుగుతో పాటు కొన్ని తమిళం, బెంగాలీ సినిమాల్లోనూ సందడి చేసింది ఈ అందాల తార. కాగా సినిమా కెరీర్‌ పరంగా పీక్స్‌ దశలో ఉండగానే అమెరికాకు వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ అక్కడ జోలాంగేల్లాతో అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెద్దల అనుమతితో కలిసి ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. కాగా గతేడాది మేలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది రిచా. తమ బిడ్డకు లూకా షాన్‌ లాంగెల్లా అనే పేరు పెట్టుకుని ప్రస్తుతం ఆ చిన్నారి ఆలనాపాలనలోనే బిజీగా గడుపుతోంది.

కాగా 2013లో విడుదలైన భాయ్‌ సినిమాలో చివరిసారిగా కనిపించింది రిచా. ఆతర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తోంది. తన భర్త, బిడ్డ ఫొటోలను అందులో పంచుకుంటోంది. అలా తాజాగా రిచా లేటెస్ట్ ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఫంక్షన్ లో భర్త, బిడ్డతో కలిసి దర్శనమిచ్చిన ఆమె నీలం రంగు లంగావోణీలో రిచా ఎంతో అందంగా కనిపించింది. అయితే తల్లయ్యాక కొంచెం బొద్దుగా మారిపోయింది. చూడగానే రిచా అని గుర్తుపట్టడం కొంచెం కష్టమనేలా మారిపోయింది. కాగా ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ‘ఇప్పటికి రిచా ఎంతో అందంగా ఉంది’, ‘బ్యూటిఫుల్‌ కపుల్‌’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ఎంటర్ టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Inspiring Story: 3 వేలతో మొదలై.. లక్షలు దాటిన బిజినెస్‌.. స్వయం ఉపాధితో రాణిస్తూ.. 19మందికి ఉపాధినిస్తున్న మహిళ

Fact Check: నిరుద్యోగులకు అలెర్ట్‌.. NTPC ఉద్యోగ నోటిఫికేషన్లపై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన..

Viral Video: అయ్యయ్యో భలే పని జరిగిందే..? కొత్త కోడలికి ఊహించని అనుభవం