
ప్రభాస్ ఫ్యాన్సా.. మజాకా.. ఇప్పడు ఎక్కడ చూసిన సలార్.. సలార్ అంటూ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. మరికొన్ని గంటల్లో సలార్ సినిమా రిలీజ్ కానుంది. సలార్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగెస్ట్ ఫిలింగా నిలుస్తుందని అంటున్నారు అభిమానులు. ప్రభాస్ నుంచివచ్చిన లాస్ట్ మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే సలార్ సినిమా టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే విదేశాల్లో రికార్డ్ స్థాయిలో సలార్ మూవీ టికెట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సలార్ మూవీ టికెట్స్ భారీగా అమ్ముడవుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడులో బుకింగ్స్ ఓపెన్ అయినా దగ్గర నుంచి రిలీజ్ రోజు వరకు ఏకంగా 30.25 లక్షల టికెట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్: 13.25 లక్షలు, నైజాం(తెలంగాణ): 6 లక్షలు, ఉత్తర భారతదేశం: 5.25 లక్షలు, కర్ణాటక: 3.25 లక్షలు, కేరళ: 1.5 లక్షలు, తమిళనాడు: 1 లక్షల టికెట్స్ తెగాయని తెలుస్తోంది.
కేజీఎఫ్ 1,2 సినిమాతో సంచలన విజయాలను అందుకున్నాడు. దాంతో ఇప్పుడు సలార్ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, బాబీ సింహ, శ్రియ రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అలాగే ప్రభాస్ కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తుంది. సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అలాగే సలార్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Few more hours to go…💥#SalaarCeaseFire 𝐑𝐄𝐁𝐄𝐋𝐥𝐢𝐧𝐠 𝐰𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐟𝐫𝐨𝐦 𝐭𝐨𝐦𝐨𝐫𝐫𝐨𝐰.
Book your tickets now 🎟️ https://t.co/k9kT5h9uJr#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/nePJwl3vyk
— Salaar (@SalaarTheSaga) December 21, 2023
Victories don’t come from wars…. They come from forgiveness.
Listen to #SalaarSecondSingle 🎵
– https://t.co/JFZUhlXLVV#Prathikadalo (Telugu), #QissonMein (Hindi), #Prathikatheya (Kannada), #Prathikaramo (Malayalam), #PalaKadhaiyill (Tamil)Music by @RaviBasrur 🎶#Salaar… pic.twitter.com/xKPU0a4Ruz
— Salaar (@SalaarTheSaga) December 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.