Salaar Theaters: హైదరాబాద్‌లో ఆ 11 థియేటర్స్‌లో సలార్ బెనిఫిట్ షోలు.. ఆ లిస్ట్ ఇదిగో

|

Dec 19, 2023 | 8:04 PM

అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసులు రంగంలో దిగారు. హైదరాబాద్ లోని క్రాస్ రోడ్ లోని థియేటర్స్ దగ్గర అభిమానులు భారీగా చేరడంతో తోపులాట జరిగింది. దాంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇక సలార్ సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ ఈ రోజు 8.20 నిమిషాలకు ఓపెన్ కానున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Salaar Theaters: హైదరాబాద్‌లో ఆ 11 థియేటర్స్‌లో సలార్ బెనిఫిట్ షోలు.. ఆ లిస్ట్ ఇదిగో
Salaar
Follow us on

సలార్ సినిమా సందడి మొదలైంది. సలార్ సినిమా టికెట్స్ ఓపెన్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆఫ్ లైన్ టికెట్స్ కోసం థియేటర్స్ దగ్గర భారీగా లైన్ లలో నిలబడ్డారు అభిమానులు. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసులు రంగంలో దిగారు. హైదరాబాద్ లోని క్రాస్ రోడ్ లోని థియేటర్స్ దగ్గర అభిమానులు భారీగా చేరడంతో తోపులాట జరిగింది. దాంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇక సలార్ సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ ఈ రోజు 8.20 నిమిషాలకు ఓపెన్ కానున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

ఇక సాలార్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. సలార్ మూవీ టికెట్ రేట్లను పెంచుతూ.. ఆదేశాలు ఇచ్చాయి. తెలంగాణాలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ పై రూ. 65 రూపాయిలు పెంచింది ప్రభుత్వం అలాగే మల్టీప్లెక్స్ లో 100 రూపాయిలు పెంచింది. ఇక ఏపీ లో సింగిల్ స్క్రీన్ పై 40 రూపాయిలు పెంచింది అక్కడి ప్రభుత్వం.

ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని పది థియేటర్స్ లో సలార్ సినిమా బెనిఫిట్ షోలు జరగనున్నాయి. అర్ధరాత్రి 1.00 గం సమయంలో బెనిఫిట్ షో లు జరగనున్నాయి. ఆ థియేటర్స్ ఏంటంటే.. 1. నెక్సెస్ మాల్ (కూకట్ పల్లి), 2. ఏఏంబీ మాల్, భ్రమరాంబ ( కూకట్ పల్లి), 3. విశ్వనాథ్ ( కూకట్ పల్లి),4.  అర్జున్ (కూకట్ పల్లి),5.  రాజధాని ( దిల్ సుఖ్ నగర్),6.  గోకుల్ ( ఎర్రగడ్డ),7.  శ్రీ రాములు (మూసాపేట్),8.  సంధ్య 35 ఎమ్ఎమ్,9. సంధ్య 75 ఎమ్ఎమ్,10. మల్లికార్జున (కూకట్ పల్లి),11. సాయి రామ్ ( మల్కాజ్గిరి) థియేటర్స్ లో సలార్ సినిమా బెన్ ఫిట్ షోలు జరగనున్నాయి.

సలార్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..