
ఎంతోకాలంగా ఎదురుచూసిన ప్రభాస్ అభిమానుల కోసం..ఆయన కొత్త మూవీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ ఎట్టకేలకు ఇటీవల విడుదలైంది. దీనికి సినిమా ప్రేమికుల నుంచి విశేష స్పందన లభించింది. కాపీ అంటూ కాస్త ట్రోలింగ్ కూడా నడిచింది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి కొత్త అప్డేట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే విషయంలో ‘బాహుబలి ‘ సెంటిమెంట్‌ని ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2017లో ఏప్రిల్ 28న ‘బాహుబలి 2’ విడుదలై రిలీజై సంచలన విజయం సాధించింది. చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే అదే తేదీన ‘రాధే శ్యామ్’ను విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోందని టాక్. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ 50 శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది