Prabhas: వాళ్ల కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదు.. ఆ విషయంలో సారీ చెప్పిన డార్లింగ్..

|

May 23, 2024 | 10:34 AM

ఇప్పటివరకు డార్లింగ్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ మొదటిసారి తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు ప్రభాస్. నిన్న రాత్రి జరిగిన కల్కి ఈవెంట్లో ప్రభాస్ స్పీచ్ విని ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. ఎప్పుడూ తన మూవీ ప్రమోషన్లలో తక్కువగా మాట్లాడే ప్రభాస్ నిన్న రాత్రి కల్కి ఈవెంట్లో మాత్రం చాలా ఎక్కువ సమయం స్పీచ్ ఇచ్చారు ప్రభాస్. అలాగే తన అమ్మాయిల ఫ్యాన్స్ కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదని అన్నారు.

Prabhas: వాళ్ల కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదు.. ఆ విషయంలో సారీ చెప్పిన డార్లింగ్..
Prabhas
Follow us on

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. డార్లింగ్ పెళ్లి గురించి నిత్యం ఏదోక వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ప్రభాస్ పెళ్లి కోసం అటు ఫ్యాన్స్.. ఇటు సినీ ప్రముఖులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు డార్లింగ్ గుడ్ న్యూస్ చెబుతాడా అని ఇంట్రెస్టింగ్‏గా చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి తన పెద్దమ్మ శ్యామలదేవి రియాక్ట్ అయిన సంగతి తెలసిందే. కానీ ఇప్పటివరకు డార్లింగ్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ మొదటిసారి తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు ప్రభాస్. నిన్న రాత్రి జరిగిన కల్కి ఈవెంట్లో ప్రభాస్ స్పీచ్ విని ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. ఎప్పుడూ తన మూవీ ప్రమోషన్లలో తక్కువగా మాట్లాడే ప్రభాస్ నిన్న రాత్రి కల్కి ఈవెంట్లో మాత్రం చాలా ఎక్కువ సమయం స్పీచ్ ఇచ్చారు ప్రభాస్. అలాగే తన అమ్మాయిల ఫ్యాన్స్ కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదని అన్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మరింత హైప్ క్రియేట్ చేశాయి. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణె వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తుండడంతో కల్కి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మే 22న రామెజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఇందులో భైరవ జీవితం ముఖ్యమైన బుజ్జి అనే వాహనాన్ని పరిచయం చేశారు.

ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. “హాయ్ డార్లింగ్స్. ఇలా చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి మీ సేఫ్టీ కోసమే. సారీ డార్లింగ్స్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లను చూసి సినీ పరిశ్రమ స్పూర్తి పొందింది. అలాంటి ఇద్దరితో కలిసి నటించడం గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నాగ్ అశ్విన్, అశ్వనీదత్ లకు థాంక్స్. చిన్నప్పుడు సాగర సంగమం సినిమా చూసి కమల్ సర్ వేసుకున్న దుస్తులు నచ్చి నాకు అలాంటివి కొనివ్వమని మా అమ్మను అడిగేవాణ్ని. ఆయన నటనకు 100 దండాలు. దీపికా, దిశా ఇద్దరు అందమైన అమ్మాయిలు. ఈ వయసులోనూ సినిమా కోసం ఆరాటపడుతున్నారు అశ్వనీదత్. ఆయనలాగే తన ఇద్దరు కుమార్తెలకు సినిమా అంటే ఫ్యాషన్. డబ్బుకు వెనకాడకుండా ఈ సినిమా తీశారు. బుజ్జిని నాగ్ అశ్విన్ ఇంట్రడ్యూస్ చేశాడు” అంటూ చెప్పుకొచ్చాడు.

జీవితంలోకి ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారంటూ మీరు పెట్టిన పోస్ట్ చూసి అమ్మాయి హృదయాలు ముక్కలయ్యాయి అని యాంకర్ సుమ అనగా.. వాళ్ల కోసమే పెళ్లి చేసుకోలేదు అంటూ పెళ్లి పై సరదాగా కామెంట్స్ చేశారు. అయితే ప్రభాస్ స్పీచ్ కు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. డార్లింగ్ స్పీచ్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఎప్పుడూ మొహమాటంగా రెండు మాటలు మాట్లాడేసి వెళ్లిపోయే ప్రభాస్ ఈసారి ఎక్కువ సమయం సరదాగా మాట్లాడం చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.