Pahalgam Terror Attack: పాకిస్తాన్‌తో సంబంధాలున్నాయంటూ ప్రచారం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ ఫౌజి హీరోయిన్

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాక్ నటీనటులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారి సినిమాలను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభాస్ ఫౌజి హీరోయిన్ ఇమాన్వీకి కూడా పాకిస్తాన్ తో సంబంధాలున్నాయని నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది ఇమాన్వీ.

Pahalgam Terror Attack: పాకిస్తాన్‌తో సంబంధాలున్నాయంటూ ప్రచారం.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ ఫౌజి హీరోయిన్
Prabhas, Imanvi

Updated on: Apr 24, 2025 | 1:03 PM

తన కుటుంబానికి పాకిస్తాన్ తో సంబంధాలున్నాయన్న వార్తలను ఫౌజి హీరోయిన్ ఇమాన్వీ ఇస్మాయిల్ తోసి పుచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. ‘మొట్టమొదట, పహల్గామ్‌లో జరిగిన విషాద సంఘటనకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా నివాళులు. నా ఐడెంటిటీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్న దానిపై నేను క్లారిటీ ఇవ్వాలని ఇలా మీ ముందుకొచ్చాను. మొదటిది మా ఫ్యామిలిలో ఎవరికీ కూడా పాకిస్తాన్ మిలటరీతో ఏ రకంగానూ సంబంధం లేదు. నా మీద ద్వేషం వ్యాప్తి చేయాలని ఇలాంటి ట్రోల్స్, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొందరు ఎలాంటి రీసెర్చ్, అధికారిక సమాచారం లేకుండా నా గురించి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లిష్ మాట్లాడే ఒక భారతీయ అమెరికన్. నేను లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియాలో పుట్టి పెరిగాను. నా తల్లిదండ్రులు చట్టబద్ధంగానే యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చారు. ఆ వెంటనే వారు అమెరికా పౌరులుగా మారారు. నేను అమెరికాలో యూనివర్సిటీ విద్యను పూర్తి చేశాను. ఆ తర్వాత నటి గా, కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్సర్ గా కెరీర్ కొనసాగిస్తున్నాను. ఇప్పుడు నాకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే అవకాశం వచ్చింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ నాపై ఎంతో ప్రభావం చూపించింది. ఇప్పుడు నేను కూడా ఇండియన్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను.

‘ నా రక్తంలో ప్రవహిస్తున్న భారతీయత, సంస్కృతిని విభజనకు బదులుగా ఐక్యతకు ఒక రూపంగా ఉపయోగించాలని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి సమయంలో మనం ప్రేమాభిమానాలను వ్యాప్తి చేయాలి. చరిత్రలో కళలే అవగాహన కోసం ఉపయోగించారు. నా ఇండియన్ వారసత్వాన్ని, సంసృతిని వ్యాప్తి చేయడానికి నేను ఎంతో ఇష్టపడతాను’ అంటూ పోస్ట్ చేసింది ఇమాన్వీ. తద్వారా తనకు కానీ, తన ఫ్యామిలీకి కానీ పాకిస్తాన్ తో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

ఇమాన్వీ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

ఇమాన్వీకి వ్యతిరేకంగా పోస్టులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి