పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్ ట్రైలర్ రికార్డ్స్ తిరగరాస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌ను షేక్ చేసింది. పవర్ స్ట్రోమ్ కు రెడీగా ఉండాలని ముందే చెప్పిన చిత్రయూనిట్.. అదే రేంజ్ లో ట్రైలర్ ను కట్ చేసి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. భీమ్లానాయక్ వర్సెస్ డానియల్ శేఖర్… ఎవరికివారు అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఈగోల్ని కాపాడుకుంటూ సాగే కథను కనెక్టివిటీ కట్టవకుండా డిజైన్ చేశారు డైరెక్టర్. ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్ .
ఈ సందర్భంగా తాజాగా భీమ్లా నాయక్ నుంచి మరో కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి కేటీఆర్ ఆ కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సరికొత్త ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి ట్రైలర్ లో లేని కొన్ని సన్నివేశాలను ఈ ట్రైలర్ లో యాడ్ చేశారు. మొత్తంగా ఈ ట్రైలర్ కూడా సినిమా పై అంచనాలను పెంచేసింది. డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్ హిట చిత్రం అయ్యప్పన్ కోషియమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Bheemla Nayak Pre Release Event Live: ఘనంగా ప్రారంభంమైన భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్
Ante Sundaraniki: గండాలు దాటడం కోసం హోమగుండాల చుట్టూ తిరుగుతున్న సుందరం.. పుట్టిన రోజున ఇలా..
Sehari Aha: ఆహాలో యూత్‌ఫుల్ లవ్ స్టోరీ.. “సెహరి” మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..