Pawan Kalyan: భార్యతో అంత ఇష్టం అంటున్న భీమ్లా నాయక్.. దసరాకు చిత్ర యూనిట్ ట్రీట్

|

Oct 05, 2021 | 8:35 PM

Pawan Kalyan- Rana: పవర్ స్టార్ పవన్ కళ్యణ్ హిట్ ప్లాప్ లతో సంబంధం లేని క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో. అందరి హీరోలకు ఫ్యాన్స్..

Pawan Kalyan: భార్యతో అంత ఇష్టం అంటున్న భీమ్లా నాయక్.. దసరాకు చిత్ర యూనిట్ ట్రీట్
Bhimla Nayak
Follow us on

Pawan Kalyan- Rana: పవర్ స్టార్ పవన్ కళ్యణ్ హిట్ ప్లాప్ లతో సంబంధం లేని క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో. అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా ఫ్యాన్స్ కు పండగే.. అదే థియేటర్స్ లో రిలీజ్ అయితే అభిమానులు చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే.. రాజకీయాల్లో అడుగుపెట్టి.. ఎన్నికల సమయంలో సినిమాలకు దూరంగా ఉన్న పవన్ వకీల్ సాబ్ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. కరోనా సమయంలో కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. వరస సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్.

మలయాళంలో సూపర్‌హిట్‌గా మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే భీమ్లా నాయక్ తొలి సింగిల్, టీజర్, రానా పాత్ర డానియల్ శేఖర్ టీజర్ విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ లో పవన్ సరసన నిత్యమీనన్ నటిస్తుండగా రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేయబోతోంది. ఎంత ఇష్టం అంటూ సాగే ఈ పాటను అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి పవన్‌, నిత్య మీనన్‌లు కలిసి కూర్చొన ఫోటోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:  పోలీసుల ఆంక్షలతో రహదారిని విడిచి పొలం బాటలో జనసైనికులు.. మీకు రుణగ్రస్తుడని అంటున్న పవన్ కళ్యాణ్..