
దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది పూజాహెగ్డే. తమిళ.. హిందీ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది ఈ వయ్యారి.

ప్రస్తుతం ఆమె తమిళ్‌లో ఓ సినిమా చేస్తుంది. దళపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలో హీరోయిన్‌గా పూజా నటిస్తుంది.

ఈ సినిమా కోసం పూజాహెగ్డే భారీ రెమ్యునరేష్ అందుకుంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం రెమ్యునరేషన్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న నయనతారను పూజ బీట్ చేసిందని తెలుస్తుంది.

బీస్ట్ సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా 5 కోట్లు వసూల్ చేస్తుందని సమాచారం.

ఇప్పటికే వరకు లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాకు 4 కోట్ల వరకు ఛార్జ్ చేస్తూ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.

ఇక నయనతార తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీస్‌లో కీర్తిసురేష్ ఉన్నారు.

అలాగే నాలుగో స్థానంలో లక్కీ బ్యూటీ రష్మిక మందన కొనసాగుతుంది.