Pooja Hegde: ఆత్మహత్య చేసుకోబోయిన పూజా హెగ్డే అంటూ ట్వీట్.. ఉమైర్ సంధుకు లీగల్ నోటీసులు..

గతంలో హీరోయిన్ కృతి సనన్, ప్రభాస్, పూజా హెగ్డే పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియా వేదికగా అతను నోటికొచ్చినట్లు తమ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు అతనికి బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు సినీతారలు. ఈ క్రమంలోనే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అతనికి లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది.

Pooja Hegde: ఆత్మహత్య చేసుకోబోయిన పూజా హెగ్డే అంటూ ట్వీట్.. ఉమైర్ సంధుకు లీగల్ నోటీసులు..
Pooja Hegde

Updated on: Jul 28, 2023 | 1:48 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ నటీనటులపై తప్పుడు ప్రచారం చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తున్నారు ఉమైర్ సంధు. ఫిల్మ్ క్రిటిక్ అంటూ చెప్పుకునే ఉమైర్ సంధు.. ఇటీవల బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో పలువురు సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి షాకింగ్ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో హీరోయిన్ కృతి సనన్, ప్రభాస్, పూజా హెగ్డే పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియా వేదికగా అతను నోటికొచ్చినట్లు తమ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు అతనికి బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు సినీతారలు. ఈ క్రమంలోనే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అతనికి లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉమైర్ సంధు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఇటీవల తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతడికి పూజా నోటీసులు పంపించింది.

పూజా హెగ్డే సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయని.. ఆమె ఇప్పుడు ఐరన్ లెగ్ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా.. “ఇటీవల ఆమె డిప్రెషన్‏తో బాధపడుతూ మధ్యాహ్నం సమయంలో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారు.. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే రక్షించారు. దేవుడికి ధన్యవాదాలు. ఆమె సోదరుడి ప్రకారం.. పూజా హెగ్డే 2 వారాలుగా తీవ్ర డిప్రెషన్‏లో ఉంది”. అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అతను చేసిన ట్వీట్ క్షణాల్లో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది.

ఇవి కూడా చదవండి

అతని వ్యాఖ్యలతో విసిగిపోయిన పూజా హెగ్డే తన గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాడని.. దీంతో తన కెరీర్‏కు నష్టం కలుగుతుందని.. అతను బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉమైర్ సంధుకు లీగల్ నోటీసులు పంపించింది పూజా హెగ్డే. అయితే లీగల్ నోటీసులు వచ్చినా.. వాటిని కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ కామెడీ చేస్తున్నాడు ఉమైర్ సంధు. పూజా హెగ్డే తనకు లీగల్ నోటీసులు పంపించిందని.. గతంలో ప్రభాస్‏తో తన పేరును ఉపయోగించినందుకు కృతి సనన్ సైతం నోటీసులు పంపిందంటూ మరో ట్వీట్ చేశాడు. కేవలం వీరిద్దరి గురించి మాత్రమే కాదు.. బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి వివాదాస్పద ట్వీట్స్ చేశాడు. అయితే ఉమైర్ సంధు లండన్‏లో ఉండడం వలన అతనిపై యాక్షన్ తీసుకోవడానికి కుదరదు. అందుకే ఆ హీరోయిన్స్ పంపిన నోటీసులను కూడా షేర్ చేస్తూ కామెడీ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.