Rajeev Rayala |
Jun 19, 2022 | 9:30 PM
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది.
ఇటీవలే పాన్ ఇండియా ఫిల్మ్ రాధేశ్యామ్, బీస్ట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ రెండు చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ పూజా స్పీడ్ మాత్రం తగ్గడం లేదు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది ఈ అమ్మడు.. అలాగే.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న జనగణమన సినిమాలోనూ నటిస్తోంది.
ఇటీవలే ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ చిన్నది.
ఇప్పుడు తన మాతృభాష అయిన కన్నడంలోనూ నటించనున్నట్లుగా తెలుస్తోంది
నర్తన్.. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమాలో కథానాయికగా ఎంచుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.