Pooja Hegde: నెట్టింట హల్ చల్ చేస్తోన్న బుట్టబొమ్మ.. లేటెస్ట్ ఫొటోస్‌తో రచ్చ
టాలీవుడ్ లో బుట్టబొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అందాల భామ పూజా హెగ్డే.తెలుగులో తక్కువ సమయంలోనే చిన్నదానికి మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చింది.
పూజాహెగ్డే .. స్టార్ హీరోయిన్ గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ భామ. టాలీవుడ్ లో బుట్టబొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అందాల భామ పూజా హెగ్డే.తెలుగులో తక్కువ సమయంలోనే చిన్నదానికి మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చింది. ఇక పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అలాగే తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది. ఇక ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో పూజ హెగ్డే చేసిన సినిమాలన్నీ బాక్సాఫిస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్, దళపతి విజయ్ తో చేసిన బీస్ట్, రామ్ చరణ్ సరసన నటించిన ఆచార్య, అలాగే బాలీవుడ్ లో రీసెంట్ గా వచ్చిన సర్కస్ ఇలా వరుసగా ఫ్లాపులు అందుకుంది ఈ భామ. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్న సినిమా ఒక్కటే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో పూజాహెగ్డే చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజూ హాట్ హాట్ ఫోటోలు, తన సినిమా అప్డేట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా ట్రెడిషనల్ డ్రస్ లో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ఇటీవలే పూజాహెగ్డే సోదరుడి వివాహం జరిగింది. ఆ వివాహంలో సందడంతా పూజాదే. ఇక తాజాగా ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram