
Puneeth Rajkumar Death: పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం యావత్ సినీలోకాన్ని విషాదంలో మించేసింది. అప్పు అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే పునీత్.. ఇక సెలవు అంటూ హఠాత్తుగా మన మధ్య నుంచి వెళ్లిపోయారు. నిన్నటికి నిన్న తన అన్న శివ రాజ్ కుమార్ నటించిన భజరంగీ 2 ప్రీరిలీజ్ ఈవెంట్లో సందడి చేస్తూ కనిపించిన పునీత్ ఈ రోజు నిర్జీవంగా కనిపించారు. నేటి (శుక్రవారం) ఉదయం తన ఇంట్లో జిమ్ చేస్తుండగా ఒక్కసారిగా పునీత్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే బెంగుళూరులోని విక్రమ్ హాస్పటల్ కు తరలించారు కుటుంబసభ్యులు. పరిస్థితి విషమించడంతో పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణ వార్త విని కన్నడ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులంతా పునీత్ మరణ వార్త విని షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.
ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పునీత్ మరణం పై సంతాపం వ్యక్తం చేశారు. విధి చాలా క్రూరమైంది.. మంచి వ్యక్తి, ప్రతిభావంతుడైన నటుడు పునీత్ రాజ్ కుమార్ ను మనకు దూరం చేసింది. ఇది ఆయన చనిపోవాల్సిన వయసు కాదు. రాబోయే తరాలకు పునీత్ ఆదర్శంగా ఉంటారని, ఆయన అద్భుతమైన వ్యక్తిత్వంను రాబోయేతరలు ప్రేమగా గుర్తుంచుకుంటాయి అన్నారు మోడీ. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి. అంటూ మోడీ ట్వీట్ చేశారు. పునీత్ చనిపోయిన ఆయన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడనున్నాయి. పునీత్ రాజ్ కుమార్ ఆయన కళ్ళను దానం చేశారు. పునీత్ కళ్లను దానం చేయనున్నట్టు ఆయన కుటుంబీకులు తెలిపారు. గతంలో పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్లను మరొకరి కోసం దానం చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి :