ఆసక్తి రేపుతోన్న ‘పెంగ్విన్’ టీజ‌ర్..

'మహానటి' మూవీలో సావిత్రి పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి దేశ‌వ్యాప్తంగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పొందిన భామ కీర్తి సురేష్‌. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ‌ పేట డైరెక్ట‌ర్ కార్తీక్‌ సుబ్బరాజు నిర్మాణంలో 'పెంగ్విన్' అనే మూవీ చేసింది.

ఆసక్తి రేపుతోన్న పెంగ్విన్ టీజ‌ర్..

Updated on: Jun 08, 2020 | 5:31 PM

‘మహానటి’ మూవీలో సావిత్రి పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి దేశ‌వ్యాప్తంగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పొందిన భామ కీర్తి సురేష్‌. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ‌ ‘పేట’ డైరెక్ట‌ర్ కార్తీక్‌ సుబ్బరాజు నిర్మాణంలో ‘పెంగ్విన్’ అనే మూవీ చేసింది. ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. అయితో క‌రోనా లాక్ డౌన్ వ‌ల్ల ఈ సినిమా ఓటీటీలో డైరెక్టుగా రిలీజ్ కాబోతుంది. జూన్ 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ రిలీజైంది. హిందీ టీజర్‌ని తాప్సీ, తెలుగులో సమంత, తమిళ టీజర్‌ని త్రిష, మలయాళ టీజర్‌ని మంజూ వారియర్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా రిలీజ్ చేశారు.

వివిధ భావోద్వేగాల మేళ‌వింపుతో టీజ‌ర్ ఆసాంతం ఆసక్తి రేపింది. ప‌క్కా థ్రిల్ల‌ర్ మోడ్ లో టీజ‌ర్ క‌టింగ్ ఉంది. కాగా చిత్ర ట్రైల‌ర్ జూన్ 11న విడుదల కానుంది. సంతోష్‌ నారాయణన్ చిత్రానికి మ్యూజిక్ అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులని పెంగ్విన్ మూవీ అల‌రిస్తుంద‌ని మేకర్స్ చెబుతున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం టీజ‌ర్ పై మీరూ ఓ లుక్కేయండి…