Payal Rajput: ఎట్టకేలకు ప్రేక్షకుల ముందు రానున్న పాయల్ నయా మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే

ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది పాయల్ రాజ్ పుత్. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మాస్ రాజా రవితేజ సరసన డిస్కో రాజా, వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాల్లో నటించింది. కానీ సక్సెస్ సాధించలేకపోయింది. మరోసారి అజయ్ భూపతి డైరెక్షన్ లో మంగళవారం అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలోనూ రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టింది పాయల్. ఇక పాయల్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Payal Rajput: ఎట్టకేలకు ప్రేక్షకుల ముందు రానున్న పాయల్ నయా మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే
Payal Rajput

Updated on: May 27, 2024 | 5:30 PM

‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమాలోనే తన అందాలతో ఆకట్టుకుంది పాయల్. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది పాయల్ రాజ్ పుత్. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఈ చిన్నది. మాస్ రాజా రవితేజ సరసన డిస్కో రాజా, వెంకటేష్ సరసన వెంకీ మామ సినిమాల్లో నటించింది. కానీ సక్సెస్ సాధించలేకపోయింది. మరోసారి అజయ్ భూపతి డైరెక్షన్ లో మంగళవారం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోనూ రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టింది పాయల్. ఇక పాయల్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాయల్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా.. ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ర‌క్ష‌ణ చిత్రం మెప్పించ‌నుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా

ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ ‘‘‘రక్షణ’ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇదొక ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. ఈ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ను జూన్ 7న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.