Payal Rajput: పాయల్ పాపకు ఎంత కష్టం వచ్చింది.. అలాంటివారికి దూరంగా ఉండండి అంటూ..

|

Apr 03, 2024 | 8:04 AM

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గాయి. అదే సమయంలో అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మంగళవారం సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. అలాగే అందాలతోనూ రెచ్చిపోయింది.

Payal Rajput: పాయల్ పాపకు ఎంత కష్టం వచ్చింది.. అలాంటివారికి దూరంగా ఉండండి అంటూ..
Paayal Raj Puth
Follow us on

ఆర్ ఎక్స్100 సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ల కలల రాకుమారి అయ్యింది ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది పాయల్. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి ఆకట్టుకుంది పాయల్. ఆతర్వాత ఈ చిన్నదనికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గాయి. అదే సమయంలో అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మంగళవారం సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. అలాగే అందాలతోనూ రెచ్చిపోయింది.

మంగళవారం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిన్నదాని పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అయితే మంగళవారం సినిమా తర్వాత ఈ చిన్నది వరుస సినిమాలతో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు కానీ అంతగాఅవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగా మారిపోయింది.  సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు అప్లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది పాయల్ రాజ్ పుత్.

తాజాగా సోషల్ మీడియాలో ఈ చిన్నది ఓ పోస్ట్ షేర్ చేసింది. మనల్ని ఎవరైతే కిందకు లాగాలని ప్రయత్నిస్తారో.. అలాంటివారికి దూరంగా ఉండండి. అలాగే సాల్వ్ కానీ సమస్యలకు దూరంగా వెళ్లండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారిని దూరం ఉంచండి. మీకు ఏదైతే డేంజర్ భావిస్తారో వాటన్నింటికీ దూరంగా ఉండటమే మంచిది. అంతే కాదు ఆరోగ్యానికి మంచిది కూడా’ అంటూ రాసుకొచ్చింది పాయల్ ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.