
సోషల్ మీడియా ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రెటీలు చాలా మంది సోషల్ మీడియా కారణంగా ఇబ్బందులు ఎదురుకొన్నారు. ఈ మధ్య డీప్ ఫేక్ అంటూ కొత్త తలనొప్పి కూడా తయారయ్యింది. ఇక హీరోయిన్స్ ను సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేయడం.. అసభ్యకర కామెంట్స్ చేయడంలాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ తమపై వచ్చే అసభ్యకరమైన కామెంట్స్ కు, ట్రోల్స్‌కు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. తాజాగా పాయల్ రాజ్ పుత్ కూడా ఓ నెటిజన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజతో డిస్కో రాజా, వెంకటేష్‌తో వెంకీ మామ లాంటి సినిమాలు చేసినా అవి పెద్దగా విజయం సాధించలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు మంగళవారం సినిమాతో హిట్ అందుకుంది పాయల్.
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ‘మంగళవారం’ సినిమాలోని ఓ బోల్డ్ సీన్ క్లిప్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసాడు. అంతే కాదు.. ఆమె లో దుస్తుల గురించి ఓ పోస్ట్ పెట్టాడు. దానికి పాయల్ రాజ్ పుత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ సీన్ కు రిప్లే ఇస్తూ.. ఆ లో దుస్తులు నావి కావని, ప్రొడక్షన్ వాళ్లు ఇచ్చినవని చెప్పింది పాయల్ రాజ్ పుత్. పాయల్ స్ట్రాంగ్ రిప్లేకు నెటిజన్ ఫిదా అవుతున్నారు. పాయల్ కు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.
You just made my day 🦋 Thanks a lot sir 🙏🏼 https://t.co/veVTCBRfQi
— paayal rajput (@starlingpayal) November 26, 2023
Might delete later 🥰#mangalavaaram ⭐️♾ pic.twitter.com/Uhjx4kB5iX
— paayal rajput (@starlingpayal) November 16, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి