Pawan Kalyan: కొడుకు అడ్మిషన్ కోసం సంగారెడ్డి జిల్లాకు వచ్చిన పవన్ కళ్యాణ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. చిన్న గ్యాప్ దొరికినా కూడా షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం హరిహరవీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా హిస్టారికల్ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అలాగే ఓజీ షూట్ లోనూ జాయిన్ అవుతున్నారు పవన్

Pawan Kalyan: కొడుకు అడ్మిషన్ కోసం సంగారెడ్డి జిల్లాకు వచ్చిన పవన్ కళ్యాణ్..
Pawan Kalyan

Edited By: Rajeev Rayala

Updated on: Jun 14, 2025 | 9:54 AM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగారెడ్డి జిల్లాకు వచ్చారు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగారెడ్డికి ఎందుకువచ్చారని  అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..  ఎప్పుడు రాజకీయాల్లో సినిమాల్లో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ నేడు ఉదయం సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ కి వచ్చారు.. తన చిన్న కొడుకు మార్క్ శంకర్ కు ఇక్రిశాట్ ఆవరణలోని ఇంటర్నేషనల్ ఆఫ్ హైదరాబాద్ లో అడ్మిషన్ కోసం వచ్చిన పవన్ కల్యాణ్ కాసేపు అక్కడే ఉండి స్కూల్ ను పరిశీలించారు.

అయితే ఇటీవల తన చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుతుండగా ఆ స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించి మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి.. అప్పటినుండి అతను హైదరాబాదులోనే ఉంటుండగా తిరిగి స్కూల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మార్క్ శంకరును ఇక్కడే చదివించాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఇక్రిశాట్ ఆవరణలో ఉన్న ఇంటర్నేషనల్ హైదరాబాద్ స్కూల్లో పలువురు సినీ ప్రముఖుల పిల్లలు చదువుతుండగా.. పవన్ కళ్యాణ్ తన చిన్న కొడుకును కూడా ఇందులోనే జాయిన్ చేయించాలని అనుకున్నట్లు సమాచారం..

అందుకే ఈరోజు(జూన్ 14) పవన్ కళ్యాణ్ సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఇక్రిశాట్ ఆవరణలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ కు వచ్చి తన కొడుకు అడ్మిషన్ కోసం మాట్లాడినట్లు సమాచారం.. పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.. మరోవైపు ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా ఎవరికి తెలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.. ఈ కార్యక్రమానికి మీడియా కూడా అలో చేయలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.